Marriage Gift : పెళ్లికి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వధూవరులిద్దరి రియాక్షన్ ఎలా ఉందంటే..?

జరగండి జరగండి అంటూ ఓ సీల్డ్ బాక్స్ లో...........

Marriage Gift : పెళ్లికి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వధూవరులిద్దరి రియాక్షన్ ఎలా ఉందంటే..?

Marriage Gift

Updated On : December 7, 2021 / 9:47 AM IST

Marriage Gift : పెళ్లి. ఎవరికైనా జీవితంలో మరిచిపోలేని వేడుక. దీన్ని సెలబ్రేషన్ గా గుర్తుండిపోయేలా చేసుకునేందుకు.. చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వారి వేడుక చూసి ముచ్చటపడి ఎంతోమంది గిఫ్టులు కూడా ఇస్తుంటారు. క్రాకరీ నుంచి.. టీవీల వరకు.. తోచినట్టుగా బహుమతులు ఇస్తుంటారు. ఐతే.. ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ డిఫరెంట్ గా ఆలోచించింది. ఫ్రెండ్ మ్యారేజీలో ఇచ్చే గిఫ్ట్ … సర్ ప్రైజింగ్ గా.. ఎప్పటికీ గుర్తుండేలా.. స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసింది.

వధూవరులిద్దరూ వన్ బై వన్ అందరితో ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ ఐదారుగురు ఫ్రెండ్స్ సందడి చేస్తూ వచ్చేశారు. జరగండి జరగండి అంటూ ఓ సీల్డ్ బాక్స్ లో పెద్ద వాషింగ్ మెషీన్ ను పట్టుకుని వచ్చారు. దాన్ని పూలతో బాగా అలంకరించారు. దాన్ని అలాగే మోస్తూ… వేదికపైకి వచ్చారు. వధూవరులిద్దరికీ దాన్ని ప్రెజెంట్ చేశారు. ఫొటోలకు పోజ్‌లు ఇచ్చారు. అంతే.. ఆ తర్వాత జరిగిన సీన్ చూసి.. పెళ్లి వేడుకకు హాజరైనవారందరూ ఘొల్లుమని నవ్వేశారు.

ఫ్రెండ్స్ తో ఫొటోలు దిగిన తర్వాత.. వధూవరులిద్దరూ దాన్ని ఓపెన్ చేశారు. అది ఖాళీ బాక్స్. అలా తీసి పక్కన పెట్టారు. ఇది చూసి వధూవరులిద్దరితో పాటు.. ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. జాగ్రత్తగా దాన్ని మోసుకుంటూ తీసుకొస్తున్నట్టు బాగా నటించారు అంటూ జోకులేసుకున్నారు. ఇన్ స్టాలో వైరల్ అయిన ఈ వీడియోను మీరూ చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by The ShaadiSwag ? (@theshaadiswag)