ఓటు వేసిన గుజరాత్ సీఎం

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్ కోట్ లోని అనిల్ గ్యాన్ మందిర్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)తన భార్యతో కలిసి వెళ్లి రూపానీ ఓటు వేశారు. గుజరాత్ లోని మొత్తం లోక్ సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగనుంది.మరోవైపు అహ్మదాబాద్ లోని రానిప్ లోని నిషాన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోడీ వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా ఉన్నారు.