Gujarat Government : గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ మాత్రమే వాడాలని ఆదేశాలు

ప్రస్తుతం ఉద్యోగులు వినియోగిస్తున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. వొడాఫోన్​-ఐడియా నెంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది.

Gujarat Government : గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ మాత్రమే వాడాలని ఆదేశాలు

Gujarat Government

Gujarat Government : ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ వినియోగంపై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుతం ఉద్యోగులు వినియోగిస్తున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. వొడాఫోన్​-ఐడియా నెంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్ పెయిడ్​ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.

Gujarat: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో 60 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ప్రత్యే కోర్టు

జియో నెంబర్ తో ఏ మొబైల్​ ఆపరేటర్​కైనా, ల్యాండ్​లైన్​కైనా కాల్​ చేయవచ్చని, నెలకు 3వేల ఉచిత ఎస్ ఎమ్ ఎస్ లను వాడుకునేలా జియో సర్వీస్ సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వం, రిలయన్స్​ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా, 4జీ సర్వీసులు అందనున్నాయి.