కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని నాలుక కోసేసుకున్న కార్మికుడు

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని నాలుక కోసేసుకున్న కార్మికుడు

Updated On : April 19, 2020 / 6:18 AM IST

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని దానిని అడ్డుకోవాలంటే నాలుక కోసేసుకోవాలనుకున్నాడో యువకుడు. అనుకున్నట్లుగానే నాలుకను కోసి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశానికి తన వంతు సాయం చేశానని చెప్పుకుంటున్నాడు. బనస్కంత జిల్లాకు చెందిన సుగమ్ తాలుకా ఇండో-పాక్ సరిహద్దుకు 18కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 

మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లాలో వివేక్ శర్మ తనతో పాటు పనిచేసే 8మంది కార్మికులతో కలిసి ఉంటుననాడు. రెండు నెలలుగా అతని సోదరుడు శివంతో కలిసి భవానీ మాత టెంపుల్ పనుల్లో ఉన్నారు. శర్మ తోటి పనివాడైన బ్రిజేశ్ సింగ్ సాబ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ.. అతనొక కాళీ మాత భక్తుడని.. మొక్కుబడి కింద నాలుక కోసేసుకున్నాడని అన్నాడు. మార్కెట్ కు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. 

సోదరుడు ఫోన్ చేసినా సమాధానమివ్వలేదు. వేరొక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి వివేక్ శర్మ నాదేశ్వరీ గుడి దగ్గర నాలుక కోసుకున్నాడని చెప్పారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. వివేక్ నాలుకను నాదేశ్వరి గుడిలో బలి ఇవ్వడం ద్వారా దేవత కరోనా వ్యాప్తి అడ్డుకుంటుందని నమ్మాడు. 

కొద్ది రోజులుగా అతను సొంతూరికి వెళ్లిపోతానని అడుగుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో అది సాధ్యం కాదని చెప్పాం. ఈ రోజు నిర్లక్ష్య వైఖరితో నాలుకను కోసేసుకున్నాడని ఎస్ఐ హెచ్ డీ పర్మార్ అన్నారు. 

గుడి ప్రాంగణంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని చేతిలో నాలుక ఉంది. అక్కడ ఉన్న ఆధ్మాత్మిక గురువు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) కమాండర్ కు సమాచారం అందించారు. శర్మను పక్కనే ఉన్న టౌన్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు అతని నాలుకను తిరిగి అతికించే పనిలో ఉన్నారు.