ఇంట్లో స్మార్ట్ లైట్ బల్బు ఉందా? మీ ఇళ్లు హైజాక్ అయినట్టే!

  • Published By: sreehari ,Published On : February 6, 2020 / 08:33 AM IST
ఇంట్లో స్మార్ట్ లైట్ బల్బు ఉందా? మీ ఇళ్లు హైజాక్ అయినట్టే!

Updated On : February 6, 2020 / 8:33 AM IST

మీ ఇంట్లో స్మార్ట్ బల్బ్ ఉందా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే. మీతో పాటు మీ ఇంటిపై కూడా హ్యాకర్లు కన్నేసి ఉంచారు. ఇళ్లు కావొచ్చు లేదా బిజినెస్ కావొచ్చు.. మీ ప్రతి మూమెంట్ హ్యాకర్లు గమనిస్తున్నారంట.. ఈ విషయం కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

ప్రత్యేకించి ప్రస్తుత మార్కెట్లో ఉన్న Philip Hue స్మార్ట్ బల్బ్ లో ఈ భద్రతా లోపం ఉన్నట్టు సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ కు చెందిన రీసెర్చర్లు గుర్తించారు. ఇందులోని భద్రతా లోపం కారణంగా లైట్ బల్బ్ నుంచి హ్యాకర్లు.. సైబర్ క్రిమినల్స్ స్పైవేర్ లేదా రాన్సమ్ వేర్ లతో ఇంట్లో నెట్ వర్క్ ల్లోకి చొరబడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

పాపులర్ జిగ్ బీ ప్రొటోకాల్ సాయంతో పనిచేయడం ద్వారా ఈ లోపం తలెత్తినట్టు తెలిపారు. సాధారణంగా ఈ ప్రొటోకాల్ ను వైర్ లెస్ నెట్ వర్క్ ల్లో వినియోగిస్తారు. స్మార్ట్ డివైజ్ లకు భద్రతా ముప్పు పొంచి ఉంటుందని అందరికి తెలుసు. కానీ, లైట్ బల్బ్స్ వంటి డివైజ్ ల్లోనూ ఈ తరహా భద్రతా ముప్పు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇదే లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఈజీగా నెట్ వర్క్ ల్లోకి మాల్ వేర్లను ఇంజెక్ట్ చేసి విలువైన సమాచారాన్ని తస్కరిస్తుంటారని చెక్ పాయింట్ రీసెర్చర్ ఓమ్రీ హెరెస్కోవీసీ తెలిపారు. ఈ భద్రతా లోపానికి సంబంధించి రీసెర్చర్లు ఫీలిప్స్ కంపెనీకి కూడా సమాచారం అందించారు. వెంటనే లైట్ బల్బులను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా యూజర్లకు సూచిస్తున్నారు.