ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ 

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 04:38 AM IST
ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ 

ముంబై : హెయిర్ లాస్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా పురుషుల్లో హెయిల్ లాస్ తో వచ్చే బట్టతలతో వారిలో ఆత్మనూన్యత భావాలకు గురవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గలవైపు మళ్లుతున్నారు. ఎలాగైన తలపై వెంట్రుకలు వచ్చేలా చేసుకునేందుకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో పలు సమస్యలకు గురవుతుండటం గురించి వింటునే ఉన్నాం. కానీ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ప్రాణాలే పోగొట్టుకున్న విషాదం ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. 
 

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఓ వ్యాపారి మృతి చెందిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. నగరంలోని సాకినాక ప్రాంతానికి చెందిన శ్రావణ్ కుమార్ చౌదరి  అనే 43 వ్యాపారి  తలపై 9,500 హెయిర్స్ ను ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. ఆ తరువాత 15 గంటల్లో అతనికి తీవ్రంగా అలర్జీ వచ్చింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే.. శ్రావణ్ కుమార్ చౌదరి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ముంబయిలోని పొవాయ్ హీరానందిని ఆసుపత్రికి వచ్చారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం ముఖం వాచిపోయి, గొంతు వాచిపోయి ఆసుపత్రికి వచ్చిన శ్రావణ్ కుమార్ చికిత్స పొందుతూ మరణించారు. అలర్జీతోనే శ్రావణ్ కుమార్ మరణించాడని డాక్టర్లు శ్రావణ్ ను పరీక్షించిన డాక్టర్స్ ధృవీకరించారు. దీంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు సదరు హెయిర్ ప్లాంటేషన్ చేసిన క్లినిక్ పై పోలీస్ కంప్లైంట్ చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.