పేద పిల్లలకు ఫ్రీగా హెయిర్ కటింగ్ చేస్తున్న బార్బర్ 

  • Published By: nagamani ,Published On : June 8, 2020 / 07:10 AM IST
పేద పిల్లలకు ఫ్రీగా హెయిర్ కటింగ్ చేస్తున్న బార్బర్ 

Updated On : June 8, 2020 / 7:10 AM IST

కష్టంలో ఉన్నప్పుడే సహాయం చేయాలి. అప్పుడే సహాయంనికో అర్థముంటుంది. దాన్ని నమ్మాడు ముంబై నగరంలోని ఓ బార్బర్. పేద పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నాడు. 

లాక్‌డౌన్‌తో పేద గొప్పా అనే తేడా లేకుండా ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వారు ఉండిపోయారు. పేదవారికైతే లాక్‌డౌన్ పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. పనులు లేక ఉన్న కొద్దిపాటి డబ్బుతో బతుకులు ఈడ్చుకొచ్చారు. ఎంతో పస్తులే ఉన్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా..హెయిర్ సెలూన్ షాపులు తెరుచుకుంటున్నాయి.

అలా సెలూన్ షాపులు తెరుచుకున్న క్రమంలో జుట్టు పెరిగిపోయిన వీధి బాలలకు ఉచితంగా క్షవరం చేస్తున్నాడు మహారాష్ట్రలోని ముంబై నగరంలోని భాండప్ ప్రాంతంలో రవీంద్ర బిరారీ అనే వ్యక్తి. చాలా ఏళ్లుగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్న రవీంద్ర లాక్‌డౌన్ విధించడంతో తన షాపును బంద్ చేశాడు.

ఆంక్షలు సడలించిన క్రమంలో రవీంద్రబిరారీ తన షాపును తిరిగి తెరిచాడు. వీధి బాలలకు ఉచితంగా క్షవరం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడేవారికి తన వంతుగా ఏదైనా చేయాలని తపనపడ్డాడు.తనకు అన్నం పెట్టే తన వృత్తినే పేదల కోసం ఉచితంగా చేయాలనుకున్నాడు. దీంతో వీధిబాలలు, పేద పిల్లలు తన వద్దకు వస్తే ఉచితంగానే క్షవరం చేస్తానని క్షురకుడు రవీంద్ర బిరారీ చెప్పారు. అలా ఎంతోమంది వీధి బాలలకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. 

Read: శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి