హలాల్ మాంసం గురించి రెస్టారెంట్లలో ముందుగానే చెప్పాలి.. సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ ఆదేశాలు

Halal: బీజేపీ అధికారంలో ఉన్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ రెస్టారెంట్లు, షాప్స్ కు ప్రపోజల్ పెట్టింది. వాళ్లు అమ్మే మాంసం హలాల్ చేసిందా లేదా జట్కా పద్ధతిలో అమ్ముతున్నారా అనేది కన్ఫామ్ చేయాలని చెప్పింది. ఈ ఆర్డర్ చికెన్ లేదా మరేదైనా మాంసం అమ్మే ప్రతి షాపుకు వర్తిస్తుందని అందులో పేర్కొంది. స్టాండింగ్ కమిటీ ఈ ప్రపోజల్ ను స్పష్టం చేసింది. దీనిని హౌజ్ కు పంపించి చట్టం చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.
హిందువులు, సిక్కులకు ఇది నిషిద్ధం:
ఛతర్‌పూర్ కౌన్సిలర్ అనితా తన్వార్ గత నెల హలాల్ మాంసం తీసుకోవడం హిందూయిజం, సిక్కిజం మతాలలో వ్యతిరేకం అని పేర్కొన్నారు. ‘సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో ఉన్న 104వార్డుల్లోని నాలుగు జోన్లలో1000 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో 90శాతం మాంసాహారాన్నే ప్రోత్సహిస్తున్నాయి. కానీ, ఆ మాంసం హలాల్ చేసిందా.. జట్కా పద్ధతిదా అనేది చెప్పడం లేదు.
అదే విధంగా మాంసం అమ్మే షాపుల్లోనూ హలాల్ చేసిందా.. మామూలుగా అమ్ముతుందా అనేది రాసి ఉంచడం లేదు. అలా చేయడాన్ని తప్పనిసరి చేయాలి.
దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ రాజ్ దూత్ గెహ్లాట్ దీనిపై చాలా కంప్లైంట్లు వచ్చాయని రెస్టారెంట్లు కచ్చితంగా సర్వ్ చేసే ముందు ఈ విషయాన్ని చెప్పాల్సిందేనని అంటున్నారు. మహమ్మారి సమయంలో ఈ కంప్లైంట్లు చాలా ఎక్కువగా కనిపించాయి.
దీనికి సొల్యూషన్ కూడా చెప్తున్నారు అనితా తన్వార్.. కార్పొరేషన్ నుంచి వార్షిక హెల్త్ ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ప్రాంతాల వారీగా ఎవరికైనా అది తప్పదు. ఇలాంటి కండిషన్ పెడితే వారు ఎలాంటి ఆహారం సర్వ్ చేస్తున్నారో తెలుస్తుందని ఆమె అన్నారు.
ఇలా చేయడం వల్ల మాంసాహారం తినే హిందూవులు ముందుగానే తెలుసుకుంటారు. వాళ్లు తినాలనుకుంటే దానికి మేం అడ్డు చెప్పేది లేదు.
హలాల్.. జట్కాల మధ్య తేడా ఏంటి?
హలాల్ అనేది అరబిక్ పద్ధతిలో ఇస్లాం చట్ట ప్రకారం తినేందుకు అనుమతి ఉన్న ఆహారం. ఇస్లామిక్ చట్ట ప్రకారం.. హలాల్ చేయాలనుకునే జంతువు మెడ సగం వరకూ కోసి వదిలేస్తారు.
దాంతో పాటు జంతువు లేదా కోడిని కోసేటప్పుడు ఆరోగ్యంగానూ, ప్రాణాలతోనే ఉండాలి. అలా సగం కోయడం వల్ల అందులో ఉన్న రక్తమంతా కిందకు కారిపోతుంది.
జట్కా పద్ధతిలో మాత్రం జంతువు, కోడి లాంటి వాటిని ఒక్క వేటుతోనే మెడ నుంచి తలను వేరే చేస్తారు.