hathras protest : యూపీ పోలీసులు దుస్తులు చింపారు

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 01:58 PM IST
hathras protest : యూపీ పోలీసులు దుస్తులు చింపారు

Updated On : October 2, 2020 / 2:08 PM IST

hathras protest : హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఘటనపై ఆగ్రహజ్వాలలు పెరుగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక వెళ్లడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకోవడంతో.. రాహుల్ కిందపడిపోయారు.



మరోవైపు.. యూపీ హత్రాస్ (hathras) ఘటనపై NHRC సీరియస్ అయింది. యూపీ సర్కార్‌కు. డీజీపీకి నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమిత్రా ధావన్ బట్టలు చింపేసినట్లు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను Aadesh Rawal (@AadeshRawal) ట్వీట్ చేశారు.



గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నేతలు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూపీ పోలీసులు, కాంగ్రెస్ నేతలకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే ఎలాంటి ఘటన అక్కడ జరగలేదని పోలీసులు అంటున్నారు.



నిర్భయ, దిశ స్థాయిలో మళ్లీ దేశాన్ని కదలించిన ఘటన హత్రాస్ గ్యాంగ్ రేప్. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఊపందుకున్నాయి.
విపక్షాలు యూపీ సర్కార్‌ తీరుపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో… కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



నోయిడాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యమునా హైవే ఎక్స్ ప్రెస్ వద్దకు రాహుల్ గాంధీ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకోవడంతో.. వారు కార్యకర్తలతో కలసి కాలినడక వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో రాహుల్ కిందపడిపోయారు.



పోలీసులు లాఠిచార్జ్ చేశారని.. తనను తోసేసి కిందపడేసింది కూడా పోలీసులే అంటూ రాహుల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే రోడ్డుపై నడవాలా అంటూ రాహుల్ ప్రశ్నించారు. సామన్యులకు నడిచే హక్కులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.. రాహుల్‌ను అరెస్ట్ చేశారు. దీంతో.. తనను ఏ రూల్ కింద.. ఎందుకు అరెస్టు చేస్తారని రాహుల్ పోలీసులను ప్రశ్నించారు. సెక్షన్ 188 ఐపీసీ కింద అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు రిప్లై ఇచ్చారు.



హత్రాస్ ఘటనపై ఆగ్రహజ్వాలలు పెరుగుతుండటంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు 144 సెక్షన్ విధించారు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడటమే దారుణమైతే.. కనీసం యువతి మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకపోవడం అత్యంత జుగుప్సకలిగిస్తోందంటూ రాహుల్, ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల యువతిపై.. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వెన్ను, ఇతర ఎముకలు విరిగేలా దారుణంగా కొట్టారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కనీసం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా, పోలీసులే రాత్రికిరాత్రే దహనం చేయడం విమర్శలకు దారితీసింది.



ఆందోళనలు పెరుగుతుండటంతో.. హత్రాస్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం NHRC తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ.. వివరణ ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వానికి, డీజీపీ‌కి నోటీసులు జారీ చేసింది.