Eephant emotional video : చనిపోయిన బిడ్డను బ్రతికించడానికి ఏనుగు ప్రయత్నం.. అస్సాంలో కన్నీరు పెట్టిస్తున్న వీడియో

మనుష్యులైనా.. జంతువులైనా తల్లి మనసు ఒకటే.. పడే వేదన ఒకటే.. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకునేందుకు ఓ ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది.

Eephant emotional video : చనిపోయిన బిడ్డను బ్రతికించడానికి ఏనుగు ప్రయత్నం.. అస్సాంలో కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Mother elephant emotional video

Updated On : June 17, 2023 / 5:51 PM IST

Eephant emotional video : చనిపోయిన పిల్ల ఏనుగును బ్రతికించాలని ఓ తల్లి ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది. మనసుని కదిలించే సంఘటన అస్సాంలోని గోశ్వర్ లో జరిగింది.

Arikomban Elephoent : ఎట్టకేలకు పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగు …

జంతువులైనా.. మనుష్యులైనా తల్లి ఎవరికైనా తల్లే.. తన బిడ్డలపట్ల అపారమైన ప్రేమను పంచుతుంది అమ్మ. అలాంటిది తన బిడ్డను కోల్పోతే .. ఓ తల్లి ఏనుగు చనిపోయిన తన బిడ్డను బ్రతికించాలని ఆరాటపడింది. శతవిధాల ప్రయత్నం చేసింది. అస్సాంలోని గోశ్వర్ లో జరిగిన ఈ ఘటన అందరిని మనసుల్ని కదిలించింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్ (@susantananda3) లో ఈ వీడియోను పంచుకున్నారు.

Maharashtra : కూతురిని ఏనుగుపై ఊరేగించిన తండ్రి.. ఎందుకో తెలిసి షాకైన జనం

‘ఈ వీడియో నా మనసుని కలచివేసింది. దూడ చనిపోయినా తల్లి వదలలేదు. చనిపోయిన శిశువును రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి నీటిలో ఉంచి బతికించేందుకు ప్రయత్నించింది. ఆ తల్లి వేదన గాలిలో మారుమోగుతోంది’ అనే శీర్షికతో సుశాంత నంద వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తల్లి ఏనుగు దుఖం చూపరులను కదిలించింది. అనేకమంది ఈ వీడియోపై స్పందించారు. మనసు బరువెక్కిందని కామెంట్లు చేశారు.