Heavy Rains : జీ20 సదస్సుకు వాన గండం.. ఢిల్లీ సహా 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Heavy Rains (14)
Heavy Rains IMD Warns : భారత వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేసింది. దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని దీంతో రాబోయే మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఆయా రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జీ20 సదస్సు వేదికైన భారత్ మండపం చుట్టూ సెప్టెంబర్ 9,10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన
ఈ మేరకు వాతావరణ శాఖ ప్రత్యేకంగా బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం మేఘావృత్తమై ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 26-28 మధ్య ఉండే అవకాశాలున్నాయని వెల్లడించింది. గురువారం ముంబైలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.