India Passport : భారత్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా పర్యటించే దేశాల లిస్ట్ .. ప్రపంచంలో మన పాస్‌పోర్టు ప్లేస్ ఎంతో తెలుసా..?
భారతదేశపు పాస్ పోర్టుతో వీసా లేకుండా ఎన్ని దేశాల్లో పర్యటించవచ్చు తెలుసా..ప్రపంచ వ్యాప్తంగా పాస్ట్ పోర్టు ప్లేస్ ఎక్కడుంది..? హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో భారత్ ఎన్నో ప్లేస్ లో ఉందంటే..

India Passport..Henley Passport Index2023
India Passport Place In World : 2023కు గాను శక్తివంతమైన పాస్ పోర్టుల లిస్టును హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (Henley Passport Index)వివరాలను వెల్లడించింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్ ని సింగపూర్ దక్కించుకుంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్టుగా సింగపూర్ (Singapore)దేశం నిలవగా రెండో స్థానంలో జర్మనీ (germany)నిలిచింది. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (Henley Passport Index)లో జపాన్ మూడో స్థానానికి పడిపోయింది..మోస్ట్ పవర్ ఫుల్ సింగపూర్ పాస్ పోర్టు(Singapore’s passport world Most powerful)తో 193 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు..
ఈక్రమంలో భారత్ పాస్ పోర్టు (Indian Pass port) సంగతేంటీ..మన దేశ పాస్ పోర్టుకు ఎంత శక్తి ఉంది. భారత పాస్ పోర్టులో వీసా లేకుండా ఎన్ని దేశాల్లో పర్యటించవచ్చు అనేది ఆసక్తికరంగా మారింది.హెన్నలీ పాస్ పోర్ట్ ఇండెక్స్ లో భారత్ గతం కంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. పాస్ పోర్టు ర్యాంకింగ్స్ ను భారత్ గణనీయంగా మెరుగు పరుచుకుని ఐదు స్థానాలు పైకి వెళ్లి 80 స్థానంలో నిలిచింది. దీంతో భారత్ పాస్ పోర్టుతో 57 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. మరి ఆదేశాలు ఏంటో తెలుసుకుందాం..వీలైతే చుట్టేద్దాం..
Henley Pass port Index 2023, Indian Passport, indian Citizens travel, 57 countries visa Free,
బార్బడోస్ (Barbados)
భూటాన్ (Bhutan) ఇది మాల్దీవుల తర్వాత దక్షిణాసియాలో రెండవ అతి తక్కువ జనాభా కలిగిన దేశం. భారతీయ పౌరులు 14 రోజుల పాటు వీసా లేకుండా దేశంలో ఉండగలరు.
బొలీవియా(Bolivia)
బ్రిటిష్ వర్జిన్ దీవులు(British Virgin Islands)
బురుండి (Burundi )
కంబోడియా(Cambodia)
కేప్ వెర్డే దీవులు(Cape Verde Islands)
కొమొరో దీవులు(Comoro Islands)
జిబౌటి(Djibouti )
డొమినికా(Dominica)
ఎల్ సల్వడార్(El Salvador) ఇది మధ్య అమెరికాలో అతి చిన్న మరియు అత్యంత జనసాంద్రత కలిగిన దేశం.
ఫిజి (Fiji)
గాబోన్(Gabon)
గ్రెనడా(Grenada)
గినియా-బిస్సావు(Guinea-Bissau)
హైతీ(Haiti)
ఇండోనేషియా(Indonesia)
ఇరాన్(Iran)
జమైకా(Jamaica)
జోర్డాన్(Jordan)
కజకిస్తాన్(Kazakhstan)
లావోస్(Laos)
మకావో (Macao (SAR China)(దీన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క మకావో స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అని అధికారికంగా పిలుస్తారు).
మడగాస్కర్(Madagascar)
మాల్దీవులు(Maldives)
మార్షల్ దీవులు(Marshall Islands)
మౌరిటానియా(Mauritania)
మారిషస్(Mauritius)
మైక్రోనేషియా(Micronesia)
మోంట్సెరాట్(Montserrat)
మొజాంబిక్Mozambique)
మయన్మార్(Myanmar)
నేపాల్(Nepal)
నియు(Niue)
ఒమన్(Oman)
పలావు దీవులు(Palau Islands),
ఖతార్(Qatar)
రువాండా(Rwanda)
సమోవా(Samoa )
సెనెగల్(Senegal)
సీషెల్స్(Seychelles)
సియర్రా లియోన్ (Sierra Leone)
సోమాలియా(Somalia)
శ్రీలంక (Sri Lanka)
సెయింట్ కిట్స్ మరియు నెవిస్(St. Kitts and Nevis)
St. లూసీ (St. Lucia)
సెయింట్ విన్సెంట్(St. Vincent)
టాంజానియా(Tanzania)
థాయిలాండ్ (Thailand)
తైమూర్ (Timor-Leste)
టాంగో (Togo)
ట్రినిడాడ్ మరియు టొబాగో(Trinidad and Tobago)
ట్యునీషియా(Tunisia)
తువాలు(Tuvalu)
వనాటు(Vanuatu)
జింబాబ్వే(Zimbabwe)
తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం (Henley Pass port Index 2023) 192 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా-రహిత ప్రవేశాన్ని అనుమతించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న జపాన్(Japan)ను సింగపూర్ భర్తీ చేసింది.కాగా..మొబిలిటీలో భారత్ పేలవమైన స్కోర్ ను గమనించాలి. దీంతో చైనా, జపాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలలో ప్రపంచవ్యాప్తంగా 177 గమ్యస్థానాలకు ప్రవేశించడానికి భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసా అనుమతి ఉండాల్సిందే.
కాగా గత ఐదేళ్లుగా శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో జపాన్ ( Japan )నెంబర్ వన్ గా కొనసాగింది. అయితే 2023లో ఆ స్థానాన్ని సింగపూర్ (Singapore)ఆక్రమించింది. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో జపాన్ మూడో స్థానానికి పడిపోయింది..పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో సింగపూర్ మొదటిస్థానంలో ఉండగా రెండో స్థానంలో జర్మనీ(Germany), ఇటలీ(Italy), స్పెయిన్ (Spain)దేశాలు నిలిచాయి. ఈ యూరప్ దేశాల పాస్ పోర్టు ఉంటే 190 దేశాల్లో తిరగొచ్చు వీసా లేకుండా..జపాన్ (Japan) తో పాటు దక్షిణ కొరియా(South Korea), ఫిన్లాండ్(Finland), ఆస్ట్రియా(Austria), ఫ్రాన్స్(France), లక్జెంబర్గ్(Luxembourg), స్వీడన్(Sweden) దేశాలు కూడా పవర్ ఫుల్ పాస్ పోర్టులు కలిగిన దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ లిస్టులో గ్రేట్ బ్రిటన్ (Britain)నాలుగో స్థానంలో ఉంది.