మహిళను చెట్టుకు కట్టేసి.. సజీవ దహనం చేసిన కొడుకులు, కోడలు
మినాతి దేబ్‌నాథ్‌కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. 2022లో ఆమె భర్త చనిపోయాడు.

Tripura: త్రిపురలో గత అర్ధరాత్రి ఘోరం చోటుచేసుకుంది. కొడుకులు, కోడలి చేతిలో ఓ మహిళ అతి దారుణాతి దారుణంగా హత్యకు గురైంది. ఆమెను ఇద్దరు కుమారులు, కోడలు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు.
మృతురాలి పేరు మినాతి దేబ్‌నాథ్‌గా (55) పోలీసులు గుర్తించారు. ఆమె ఇద్దరు కుమారుడు, నిందితులు రణబీర్ దేబ్నాథ్, బిప్లబ్ దేబ్నాథ్, కోడలిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్‌లోని ఓ ఇంటి వెనుక ఉన్న చెట్టు వద్ద కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. మినాతి దేబ్‌నాథ్‌కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. 2022లో ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత తన చిన్నకుమారులతో కలిసి చంపక్‌నగర్‌లో నివసించారు.
ఆమె పెద్ద కుమారుడు అగర్తలాలో నివసిస్తున్నాడు. రెండో కుమారుడు రణబీర్ దేబ్నాథ్, అతడి భార్య ఇద్దరూ ఈ కేసులో నిందితులే. స్థానిక ప్రజల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మినాతి కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆమె కుమారుల్లో ఇద్దరు అనుమానిస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ చుట్టూ రాజకీయం.. ఎందుకంటే?