Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీ, 3 నెలల్లో నివేదిక, నా తండ్రి కూడా..- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుంది.

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీ, 3 నెలల్లో నివేదిక, నా తండ్రి కూడా..- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Updated On : June 14, 2025 / 4:31 PM IST

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ రెండు రోజులు తనకు ఎంతో భారంగా గడిచాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసు అన్నారు. తనకు బాధితుల బాధ తెలుసన్నారు. తన తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు.

”విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాము. ప్రమాదం స్థలాన్ని పరిశీలించాను. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వీలైనంత సహాయక చర్యలను గుజరాత్ ప్రభుత్వం వెంటనే చేపట్టింది. పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాము. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్ లతో పాటు ఐదుగురితో AIB బృందాలను ఏర్పాటు చేశాము.

బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుంది. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో కీలకం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేశాము. హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, గుజరాత్ అధికారులు, పోలీస్ కమిషనర్ అహ్మదాబాద్, స్పెషల్ డైరెక్టర్ ఐబీని కమిటీలో నియమించాము. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాము.

Also Read: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అసలు గొడవ ఏంటి? దశాబ్దాల శత్రుత్వానికి దారితీసిన కీలక సంఘటనలివే..!

ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా DGCA కు ఉత్తర్వులు ఇచ్చాము. బోయింగ్ విమానాలు దేశంలో 34 ఉన్నాయి. 8 ఆల్రెడీ ఇన్ స్పెక్షన్ చేశాము. డీఎన్ఏ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హై లెవెల్ కమిటీతో సోమవారం భేటీ అవుతాను. గడిచిన 48 గంటల నుంచి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాము” అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ నెల 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే బతికారు. ఇక విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో 33 మంది మెడికోలు సైతం మరణించారు.