Israel Iran Conflict : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అసలు గొడవ ఏంటి? దశాబ్దాల శత్రుత్వానికి దారితీసిన కీలక సంఘటనలివే..!

Israel Iran Conflict : మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌లో దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది.

Israel Iran Conflict : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అసలు గొడవ ఏంటి? దశాబ్దాల శత్రుత్వానికి దారితీసిన కీలక సంఘటనలివే..!

Israel Iran Conflict

Updated On : June 16, 2025 / 5:00 PM IST

Israel Iran Conflict : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం భగ్గుమంటోంది. నువ్వానేనా అన్నాట్టుగా ఇరుదేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్‌పై (Israel Iran Conflict) దాడులకు తెగబడింది. దాంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌లో దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు ముందే ఈ దాడి జరిగింది.

ఇరుదేశాల మధ్య శతాబ్దాల శత్రుత్వం యుద్ధ భయాలను మరింత పెంచుతుంది. ఇరాన్, ఇజ్రాయెయల్ మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు.. ఎన్నో దశాబ్దాల నాటిది. అప్పటినుంచి ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

అందులో ప్రధానంగా ఇరాన్ విప్లవం, హిజ్బుల్లా పెరుగుదల, అణుబాంబు వంటి ఆందోళనలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఒక దేశంపై మరో దేశం దశబ్దాలుగా వరుస దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇటీవలి దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణను మరింత తీవ్రతరం చేశాయి.

ఇస్లామిక్ రిపబ్లిక్, అమెరికా మధ్య ఒమన్‌లో టెహ్రాన్ యురేనియం సుసంపన్నత కార్యక్రమంపై చర్చలు జరగాల్సి ఉంది. దీనికి ఒక రోజు ముందే శుక్రవారం (జూన్ 13) ఇరాన్‌పై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

Read Also : NPS Vatsalya Scheme : మీ పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ. 1.80 లక్షల పెట్టుబడితో రూ.11 కోట్ల రాబడి పొందొచ్చు..!

2023లో గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతుందనే భయాలను పెంచుతోంది. ఈ దాడుల వెనుక దశాబ్దాల చరిత్ర దాగి ఉంది. అదే ఎన్నో రహస్య సంఘర్షణలకు దారితీసింది. ఫలితంగా సముద్రం, వాయు, సైబర్ దాడులు వంటివి ఎన్నో జరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కీలక సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1979 : ఇజ్రాయెల్‌‌కు మిత్రదేశంగా ఇరాన్ ఉండే రోజులివి.. ఇస్లామిక్ విప్లవంలో మొహమ్మద్ రెజా షాను అధికారం నుంచి తొలగించారు. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించడం మొదలైంది. అలా రెండు దేశాల మధ్య వైరానికి బీజం పడింది.

1982 : ఇజ్రాయెల్ లెబనాన్‌పై దండెత్తినప్పుడు.. ఇరాన్ విప్లవ గార్డ్స్ తోటి షియా ముస్లింలతో కలిసి హిజ్బుల్లాను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ పారామిలిటరీని సరిహద్దుల్లో విరోధిగా భావించింది.

1983 : ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా లెబనాన్ నుంచి పాశ్చాత్య, ఇజ్రాయెల్ దళాలను తరిమికొట్టడానికి ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడింది. నవంబర్‌లో ఇజ్రాయెల్ సైనిక లెబనాన్ ప్రధాన కార్యాలయంలోకి బాంబులతో కారు దూసుకెళ్లింది. ఆ దాడితో ఇజ్రాయెల్ లెబనాన్‌లోని ప్రాంతాల నుంచి వైదొలిగింది.

1992-94 : 1992లో బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీపై 1994లో యూదు కేంద్రంపై ఇరాన్ హిజ్బుల్లా ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడిందంటూ అర్జెంటీనా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఇరాన్, హిజ్బుల్లా బాధ్యతను నిరాకరించాయి.

2002 : యురేనియం కోసం ఇరాన్ పన్నాగం బహిర్గతం కావడం, అణుబాంబు నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అణు బాంబు తయారీకి ప్రయత్నిస్తుందనే ఆందోళనను రేకెత్తిస్తుంది. అయితే, ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

2006 : ఇజ్రాయెల్ లెబనాన్‌లో నెలరోజుల పాటు హిజ్బుల్లాతో పోరాడింది. కానీ, భారీగా ఆయుధాలను కలిగిన సైన్యాన్ని అణిచివేయలేకపోయింది.

2009 : ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌ను అత్యంత ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు.

2010 : అమెరికా, ఇజ్రాయెల్ కలిసి హానికరమైన కంప్యూటర్ వైరస్ స్టక్స్‌నెట్‌ రూపొందించాయని, ఇరాన్‌లోని నాటంజ్ అణు కేంద్రంలోని యురేనియం కేంద్రంపై దాడికి ఉపయోగించారు. పారిశ్రామిక యంత్రాలపై జరిగిన మొదటి సైబర్ దాడి.

2012 : టెహ్రాన్‌లో మోటార్‌సైకిలిస్ట్ కారుపై బాంబు దాడిలో ఇరాన్ అణు శాస్త్రవేత్త మోస్తఫా అహ్మది-రోషన్ మరణించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని నగర అధికారి ఆరోపించారు.

2018 : ప్రపంచ శక్తులతో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. ట్రంప్ నిర్ణయాన్ని చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. గత మేలో ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయడంతో ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్లను ప్రయోగించింది.

2020 : బాగ్దాద్‌లో జరిగిన అమెరికన్ డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ విదేశీ విభాగం కమాండర్ జనరల్ ఖాసేమ్ సోలైమాని హత్యను ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇరాకీలో అమెరికన్ దళాలను ఉంచిన స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు వంద మంది అమెరికా సైనిక సిబ్బంది గాయపడ్డారు.

2021 : పాశ్చాత్య నిఘా సంస్థలు అణ్వాయుధాల అభివృద్ధికి ఇరానియన్ సూత్రధారి మొహ్సేన్ ఫక్రిజాదే హత్యకు ఇజ్రాయెల్‌ను ఇరాన్ నిందించింది. టెహ్రాన్ సైతం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

2022 : టెహ్రాన్‌తో దౌత్యంపై విభేదిస్తున్న మిత్రదేశాల్లో ఇరాన్ అణ్వాయుధాల తిరస్కరణపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్ సంయుక్తంగా ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాతే అధ్యక్షుడిగా బైడెన్ ఇజ్రాయెల్‌లో మొదటిసారి పర్యటించారు.

ఏప్రిల్ 2024 : డమాస్కస్‌లోని ఇరానియన్ రాయబార కార్యాలయంపై అనుమానిత ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు మరణించారు. ఇజ్రాయెల్ ఈ దాడికి బాధ్యతను ధృవీకరించలేదు. అలా అని తిరస్కరించనూ లేదు.

ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ భూభాగంపై జరిపిన దాడిలో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఏప్రిల్ 19న ఇరాన్ గడ్డపై ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి దిగింది.

అక్టోబర్ 2024 : సెప్టెంబర్ 27న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు, జూలై 31న ఇరాన్ రాజధానిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై 180కి పైగా క్షిపణులను ప్రయోగించింది.

ఇజ్రాయెల్ ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడి చేసి టెహ్రాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ మీడియా టెహ్రాన్‌ సమీపంలోని సైనిక స్థావరాలపై గంటల పాటు పేలుళ్లు సంభవించాయని నివేదించింది. ఇరాన్‌లో కొన్ని ప్రదేశాలకు నష్టం వాటిల్లిందని నివేదించింది.

Read Also : Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?

జూన్ 2025 : ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బతీసే లక్ష్యంతో అణు బాంబుపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను టార్గెట్ చేసింది. ఈ దాడిని “రైజింగ్ లయన్” అనే పేరుతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇరాన్ కమాండర్లు, క్షిపణి కర్మాగారాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతోంది. ఈ దాడిలో టెహ్రాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హోస్సేన్ సలామి, అణు శాస్త్రవేత్తలు ఫెరీడౌన్ అబ్బాసి-దవానీ, మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి మరణించినట్లు ఇరాన్ స్థానిక మీడియా నివేదించింది.

అయితే, ప్రస్తుతం ఈ ఆపరేషన్‌కు సాయం అందించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇది ప్రమాదకరమైన ప్రదేశంగా మారబోతుందంటూ అమెరికా దళాలను మధ్యప్రాచ్యం నుంచి తరలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ దాడులు జరిగాయి.