Hijab : కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత.. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్దరామయ్య

మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.

Hijab : కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత.. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్దరామయ్య

Hijab ban to lifted

Hijab Ban to Lifted : కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం విధించిన హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.

కర్ణాటకలోని స్కూల్స్, కాలేజీల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని శనివారం నుంచి ఉపసంహరించుకోనున్నట్లు సీఎం సిద్దరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. వస్త్రధారణ ఎంపిక ఒకరి సొంత హక్కు అని అన్నారు. అందరితో కలిసి అందరి వికాసం అన్న ప్రధాని మోదీ మాట బూటకం అన్నారు.

Yashasvi : ప్రవాసాంధ్రుడు యశస్విని హైదరాబాద్ ఎయిర్ పొర్టులో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

బట్టలు, కులం ఆధారంగా బీజేపీ సమాజాన్ని, ప్రజలను విభజిస్తోందని పేర్కొన్నారు. కాగా, హిజాబ్ పై గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధన ఇస్లాంలో లేదంటూ హిజాబ్ పై నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. విద్యాసంస్థల్లో అందరికీ ఒకే రకమైన వస్త్రాధారణ ఉండాలని సూచించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.