Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా వ్యాలీ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

Himachal

Updated On : July 25, 2021 / 5:22 PM IST

Himachal Bridge హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా వ్యాలీ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ఆదివారం మధ్యాహ్నాం 2.15 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండపై నుంచి రాళ్లు వేగంగా దొర్లుకుంటూ కిందకి పడ్డాయి. కొండపై నుంచి భారీగా పడిన బండరాళ్ల ధాటికి సమీపంలో ఉన్న వంతెన కూలిపోయింది. దగ్గరలో ఉన్న వాహనాలు, విశ్రాంతి​ గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా, గత వారం భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలకు గురయ్యే పలు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని క్షతగాత్రులకు వైద్య సహయాన్ని అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ అబిద్‌ హూస్సేన్‌ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటన జరిగింది.