CM Hospitalised : అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం, అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే..
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు.

Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu
CM Sukhvinder Singh Sukhu : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు. స్టమక్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సీఎం సుఖును సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. వెంటనే స్పందించిన డాక్టర్ల బృందం ఆయనకు అల్ట్రాసౌండ్ తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాసౌండ్ రిపోర్టులో అన్ని సాధారణంగానే ఉన్నాయన తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే విషయాన్ని వెల్లడించారు.
సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐజీఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ రావ్ తెలిపారు. అల్ల్రాసౌండ్ రిపోర్టుతో పాటు మిగతా పరీక్షల్లోనూ అంతా నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు.
కాగా.. ఇటీవల ధర్మశాలలో జరిగిన ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ను సీఎం సుఖు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డాలతో కలిసి స్టేడియంలో వీక్షించారు. అనంతరం కొన్ని రోజులకే ఆయన అస్వస్థతకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్ధులతో కలిసి కాంగ్రెస్ నేత, సీఎం సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా(బీజేపీ నేతలు)మధ్యలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూడటం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.
హిమాచల్ రాజకీయాల్లో సుఖ్ విందర్ సింగ్ నదౌన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి రషీల్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఓ డ్రైవర్ కావటం గమనించాల్సిన విషయం. సుఖ్ విందర్ సింగ్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి చేరుకున్నారు.