Bilkis Bano Case: హిందువులు రేప్ చేయరు.. బిల్కిస్ బానో అత్యాచార నిందితుడు

వీరు జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. గోద్రా ఘటన అనంతరం స్వగ్రామమైన దాహోడ్ గ్రామాన్ని విడిచిపెట్టిన బిల్కిస్ బానో కుటుంబం.. ఇప్పటికీ బయటే ఉంటోంది. ప్రస్తుతం వారికి కొత్త ఆపద పొంచి ఉందని బిల్కిస్ కుటుంబం వాపోతోంది. బిల్కిస్ నివాసాన్ని ఒక హిందూ మహిళకు ఇచ్చారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఒక బట్టల దుకాణం కొనసాగుతోంది

Bilkis Bano Case: హిందువులు రేప్ చేయరు.. బిల్కిస్ బానో అత్యాచార నిందితుడు

Hindus don't rape says Bilkis Bano Convict

Updated On : October 23, 2022 / 5:40 PM IST

Bilkis Bano Case: ‘‘హిందువులు రేప్ చేయరు. వారు అమాయకులు. హిందువులు రేప్ చేయడం ఎక్కడైనా చూశారా?’’.. ఈ వ్యాఖ్యలు చేసింది బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు 11 మంది నిందితుల్లో ఒకడైన గోవింద్ నాయి అనే వ్యక్తి. జీవిత ఖైదు శిక్ష పడి.. ఈ మధ్యే జైలు జీవితం అనుభవించి మూడేళ్ల క్రితం విడుదలైన గోవింద్ నాయిని తాజాగా ప్రశ్నించగా వచ్చిన సమాధానం ఇది. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో అనే ముస్లిం మహిళపై కొంత మంది అత్యాచారం చేశారు. అనంతరం వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఇందులో కొందరు పెరోల్‭పై చాలా రోజుల క్రితమే విడుదల కాగా, మరి కొందరిని సత్ ప్రవర్తన కారణంగా ఆగస్టు 15న విడుదల చేశారు.

వాస్తవానికి వీరు జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. గోద్రా ఘటన అనంతరం స్వగ్రామమైన దాహోడ్ గ్రామాన్ని విడిచిపెట్టిన బిల్కిస్ బానో కుటుంబం.. ఇప్పటికీ బయటే ఉంటోంది. ప్రస్తుతం వారికి కొత్త ఆపద పొంచి ఉందని బిల్కిస్ కుటుంబం వాపోతోంది. బిల్కిస్ నివాసాన్ని ఒక హిందూ మహిళకు ఇచ్చారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఒక బట్టల దుకాణం కొనసాగుతోంది. 2017లో పెరోల్‭పై విడుదలైన సమయంలో కూడా కొంత మందిపై గోవింద్ బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇక తాజాగా గోవింద్ నాయిని అత్యాచార ఘటన గురించి ప్రశ్నించగా ‘‘మేము అమాయకులం. మామ కానీ, మేనల్లుడు కానీ ఒకరి ముందు అత్యాచారం చేయడం ఎప్పుడైనా చూశారా? అసలు హిందూ సమాజంలో అలా జరుగుతుందా? హిందువులు ఎప్పుడూ అలా చేయరు’’ అని అన్నారు. గోవింద్ మాత్రమే కాకుండా.. ఈ కేసులో జైలు జీవితం అనుభవించి గతంలో విడుదలైన రాధేశ్యామ్ షా, ఆశిస్, రాజుభాయ్ సోని సైతం స్థానికులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా, సుదీర్ఘ కాలంగా దేశంలో చర్చనీయాంశంగా ఉన్న బిల్కిస్ బానో అత్యాచార నిందితులు ‘తాము అమాయకులం’ అని వ్యాఖ్యానించడం ‘హిందువులు రేప్ చేయరు’ అని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Reliance Jio 5G : భారత్‌లో జియో 5G Wi-Fi సర్వీసులు.. Jio True5G సర్వీసు ఏయే నగరాల్లో అందుబాటులోకి వచ్చిందంటే..!