2 వేల కేజీల పూలతో హోలీ రంగులు: వేడుకల్లో బ్రిటన్ అధికారులు 

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 04:20 AM IST
2 వేల కేజీల పూలతో హోలీ రంగులు: వేడుకల్లో బ్రిటన్ అధికారులు 

Updated On : March 21, 2019 / 4:20 AM IST

అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ హోలీ వేడుకల్ని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రసాయినాలతో చేసిన కృత్రిమ రంగుల జోలికి వెళ్లకుండా సహజమైన రంగులతో హోలీ కేళీలో 10వేల మందికి పైగా పరవశించుపోతున్నారు. ఈ అరుదైన..అద్భుతమైన..అసలైన సహజసిద్ధమైన హోలీ కేళీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల కాలూపూర్ స్వామీ నారాయణ్ మందిరంలో చోటుచేసుకుంది. 
 

2 వేల కేజీల  పూలతో తయారు చేసిన హోలీ రంగులతో వేడుకలు నిర్వహించారు మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ డిప్యూటీ హై కమిషనర్ జియోస్ వేన్, నూతన డిప్యూటీ కమిషనర్ పీటర్ కుక్‌తో పాటు 10 వేల మంది ప్రజలు పాల్గొన్నారు. మందిరం ఆవరణలో రంగులు జల్లుకుంటూ నృత్యాలు చేస్తు..ఆనందంలో మునిగిపోయారు. 25 కిలోల గులాల్, వెయ్యి లీటర్ల నీటిని వినియోగించి ఈ రంగుల్ని తయారు చేశామని మందిరం నిర్వాహకులు తెలిపారు. అహ్మదాబాద్‌లో గల కాలూపూర్ స్వామీ నారాయణ్ మందిరంలోనే కాక యూపీలోని బృందావనం, ముధుర తదితర ప్రాంతాల్లో ఈ రోజు హోలీ వేడుకల్ని సహజమైన రంగులతో  జరుగుపుకుంటున్నారని తెలిపారు.