బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

  • Published By: chvmurthy ,Published On : September 21, 2019 / 10:17 AM IST
బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

Updated On : September 21, 2019 / 10:17 AM IST

బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర  హోం మంత్రి అమిత్ షా శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ  పరిస్ధితులను,  అభివృధ్ది పనులను  సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టంగా ఉందని…  అభివృధ్ది పనులు బాగా జరుగుతున్నాయని వివరించారు.  పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన  ఈ కార్యక్రమంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ పాల్గోన్నారు.