Car Explodes : బాబోయ్.. బాంబులా పేలిపోయిన కారు, ఒకరి మృతి, ఇంట్లో పార్కింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. అసలేం జరిగింది?
భారీగా పేలుడు శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా? అని భయాందోళనకు గురయ్యారు. Kerala - Car Explodes

Kerala - Car Explodes(Photo : Google)
Kerala – Car Explodes : కేరళ రాష్ట్రం అలపుజా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అనూహ్యంగా బాంబులా పేలిపోయింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. కారు పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో కారు పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మృతుడి పేరు క్రిష్ణ ప్రకాశ్. వయసు 35ఏళ్లు. ప్రకాశ్ తన కారుని తన ఇంట్లో పార్కింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కారు పేలిపోయింది. భారీగా పేలుడు శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా? అని భయాందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే మంటల్లో తగలబడిపోతున్న కారు కనిపించింది. అసలేం జరిగిందో అర్థం కాలేదు.
రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలు అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలు కారు ఎందుకు పేలింది? అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఫోరెన్సిక్, సైంటిఫిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కారు పేలడానికి గల కారణాలపై దర్యాఫ్తు చేస్తున్నాయి. కారు పేలుడు ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపు వారందరికి ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. కాగా, కారు అలా ఎందుకు పేలింది? అనేది తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ నుంచి నివేదిక వస్తే కానీ ఏ విషయం చెప్పలేము అని పోలీసులు అంటున్నారు.
”ఇదొక దురదృష్టకర ఘటన. మావెలిక్కరలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. క్రిష్ణ ప్రకాశ్ అలియాస్ కన్నన్ తన కారుని తన ఇంటి పరిసరాల్లో పార్కింగ్ చేసే ప్రయత్నంలో ఉండగా కారు పేలిపోయింది. మృతుడు ప్రకాశ్ ఓ ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్నాడు. ఆయన తన అద్దె ఇంటి ముందు కారుని పార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కానీ, పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో క్రిష్ణ ప్రకాశ్ ను కాపాడలేకపోయారు. ప్రమాదంలో అతడు చనిపోయాడు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది” అని పోలీసులు వెల్లడించారు.
Tragic incident in Mavelikkara, Alappuzha District in Kerala, as a young person lost his life last night when the electric car he was driving suddenly exploded and caught fire, when he was about to enter the compound of his house. Video source: Manorama online news. pic.twitter.com/Qet1j6Y9ZD
— Syam Kumar V (@Syamkumarnair) August 7, 2023