Pet Cat Fight : పిల్లి ఎంత పని చేసింది.. బట్టలు చింపుకుని మరీ దారుణంగా కొట్టుకున్న రెండు కుటుంబాలు, షాకింగ్ వీడియో

ఆ పిల్లి తమ ఇంట్లోకి దూరుతోందని, గలీజ్ చేస్తోందని పక్కింటి వాళ్లు పిల్లి యజమానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. Pet Cat Fight

Pet Cat Fight : పిల్లి ఎంత పని చేసింది.. బట్టలు చింపుకుని మరీ దారుణంగా కొట్టుకున్న రెండు కుటుంబాలు, షాకింగ్ వీడియో

Pet Cat Fight (Photo : Google)

Pet Cat – Viral Video : ఈరోజుల్లో ప్రతి ఇంట్లో కుక్కనో, పిల్లినో పెంచుకోవడం సర్వ సాధారణంగా మారింది. వాటిని జంతువుల్లా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా వాటిని పెంచుకుంటున్నారు. కొందరు ఇంట్లో కుటుంబసభ్యుల కన్నా ఎక్కువగా కుక్కలను, పిల్లులను చూసుకుంటున్నారు.

అయితే కొన్నిసార్లు ఈ కుక్కలు, పిల్లుల పెంపకం వల్ల సమస్యలు వస్తున్నాయి. చుట్టుపక్కల వారితో గొడవలకు కారణం అవుతున్నాయి. మీ కుక్క మొరుగుతోందని కొందరు, మా ఇంటి దగ్గర గలీజ్ చేస్తోందని మరికొందరు, మీ పిల్లి మా ఇంట్లోకి దూరుతోందని ఇంకొందరు వాటి యజమానులతో గొడవ పడుతున్నారు. తాజాగా ఓ పిల్లి కారణంగా దారుణం జరిగిపోయింది. రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇరు కుటుంబాలు దారుణంగా కొట్టుకున్నాయి.

Also Read..Indigo Flight : ఇండిగో విమానంలో ప్రయాణీకులకు చేదు అనుభవం.. తుడుచుకోవటానికి టిష్యూలు ఇచ్చారు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు పిల్లి కారణంగా రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నాయి. ఓ కుటుంబం పిల్లిని పెంచుకుంటోంది. అయితే, ఆ పిల్లి తమ ఇంట్లోకి దూరుతోందని, గలీజ్ చేస్తోందని పక్కింటి వాళ్లు పిల్లి యజమానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది. పక్కింటి వ్యక్తి గడ్డపారతో పిల్లి పెంచుతున్న మహిళపై దాడి చేశాడు. ఆమెను కిందపడేసి తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Lift Accident : OMG.. ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులే.. రెప్పపాటులో ఘోర లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు, షాకింగ్ వీడియో

ఓ మహిళ నేలపై పడిపోయి ఉంది. ఓ వ్యక్తి గడ్డపారతో ఆమెపై దాడి చేయడం వీడియోలో ఉంది. ఈ గొడవలో ఓ మహిళ దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు షాక్ కి గురయ్యారు. పిల్లి ఎంత పని చేసింది అని తల పట్టుకున్నారు. పిల్లి చేసిన పనికి రెండు కుటుంబాలు ఇలా దారుణంగా కొట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. వీళ్లేం మనుషులురా నాయనా అని విస్తుపోతున్నారు. దీనిపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.