karnataka : ప్రాణాలమీదకు తెచ్చిన పెళ్లి విందు .. ఆస్పత్రిపాలైన 150మంది
పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైయ్యారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.

Food poisoning
karnataka wedding denner food poisoning : ఉత్సాహంగా పెళ్లికి వెళ్లి భోజనాలు చేసిన 100మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పెళ్లి విందు అంటే రకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. రకరకాల పుడ్ ఐటమ్స్ తిన్నవారిలో 150మంది కాసేపటికే వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు.వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
కర్ణాటక(karnataka)లోని బెలగావి(Belagavi )లోని హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. బంధు, మిత్రులతో పెళ్లి కళకళలాడుతు ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు వచ్చిన వారంతా భోజనాలు చేశారు. భోజనం చేసిన రెండు గంటలకు తీవ్రమైన కడుపు నొప్పితో అల్లాడిపోయారు. వాంతులు, విరేచనాలతో వీరందరినీ బెలగావిలో ఆసుపత్రిలో చేర్పించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నామని చిక్కోడి జిల్లా (Chikkodi district) ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గడద్ (Dr SH Gadad)తెలిపారు. దీంతో పెళ్లిలో వంట పదార్థాలను, వాటర్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించామని తెలిపారు. చికిత్స అందించడం కోసం గ్రామంలోని ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని..భోజనాలు తినడం వల్ల అస్వస్థతకు గురైనవారు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఒక్కసారిగా అంతమంది ఆస్పత్రి పాలవ్వటంతో హాస్పటల్ సిబ్బంది ఎమర్జెన్సీగా కేసుగా భావించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలాగే ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. దీంతో అధికారులు పెళ్లివేడుక జరిగిన ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్కడి ఫుడ్స్ శాంపిల్స్, నీటి నమూనాలను తీసుకొని వాటిని
బెంగళూరు(Bengaluru),బెళగావి (Belagavi )ప్రభుత్వ ప్రయోగశాలలకు (government laboratories) పంపించారు. ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వచ్చిన తరువాత వంటలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవటంతో ఊపిరి తీసుకున్నారు. వీరిలో కొంతమంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. వారు కూడా కోలుకుంటున్నారని తెలిపారు.