Karnataka : విషాదం.. ఇల్లు కూలి ఏడుగురు మృతి

కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెళగావి జిల్లా బదల అంకాలగిరిలో ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి చెందారు.

Karnataka : విషాదం.. ఇల్లు కూలి ఏడుగురు మృతి

Karnataka (3)

Updated On : October 6, 2021 / 9:54 PM IST

Karnataka : కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెళగావి జిల్లా బదల అంకాలగిరిలో ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి చెందారు. వర్షాల కారణంగా ఇల్లు కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని శిథిలాల్లోంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read More : Peddapalli : లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి