విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా

జ‌మ్మూకాశ్మీర్ లోని  పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.

  • Published By: sreehari ,Published On : February 15, 2019 / 11:42 AM IST
విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా

Updated On : February 15, 2019 / 11:42 AM IST

జ‌మ్మూకాశ్మీర్ లోని  పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరజవానులకు జోహార్.. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల మారణహోమానికి CRPF జవాన్లు బలైన తీరు దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఎముకలు కొరికే చలిలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దు రక్షకుల్లా ఉగ్రవాదులతో పోరాడి వీరమరణ పొందిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. వీర్ జ‌వాన్ అమ‌ర్ రహే నినాదాల‌తో అమ‌రుల‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నివాళుల‌ర్పించాయి. పుల్వామా ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరిగిపోతోంది. జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను అణిచి వేయాలని అప్పుడే అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరుతుందని అంటున్నారు. జ‌మ్మూకాశ్మీర్ లోని  పుల్వామా జిల్లాలో గురువారం (ఫిబ్ర‌వ‌రి-14,2019) పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.  రెండు దశబ్దాల కాలంలో భారతీయ జవాన్లపై జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదే. ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా, పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. 

మీ వంతు విరాళం ఇవ్వొచ్చు..
జవాన్ల కుటుంబ సభ్యులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. దేశ ప్రజలుగా మీరు కూడా మీ వంతు సాయం చేసేందుకు ముందుకు రావొచ్చు. మరణించిన జవాన్ల పిల్లల విద్య కోసం విరాళాలు ఇచ్చి వారికి మీ వంతు చేయూతను అందించవచ్చు. ‘భారత్ కీ వీర్’ కార్పస్ ఫండ్ వెబ్ సైట్ ద్వారా మీ విరాళాన్ని అందజేయొచ్చు. లేదా.. గూగుల్ ప్లే స్టోర్ లో భారత్ కీ వీర్ అనే యాప్ కూడా అందుబాటులో ఉంది. మీరు జవాన్ల కుటుంబాలకు సాయం చేయాలనుకుంటే యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా మీ విరాళాన్ని అందజేయొచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నచోటే ఉండి జవాన్ల కుటుంబాలను ఆదుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. Bharat Ke Veer యాప్.. మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు..  ఈ మొబైల్ యాప్ నుంచే విరాళాలు నేరుగా జవాన్ల కుటుంబాల అకౌంట్లలోకి పంపొచ్చు. 

భారత్ కీ వీర్ యాప్, వెబ్ సైట్
జవాన్ల మరణానంతరం వారి కుటుంబాలను ఆదుకునేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘భారత్ కీ వీర్’ అనే వెబ్ సైట్, మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. దీనిద్వారా వీరజవాన్ల కుటుంబ సభ్యులు, వారి పిల్లలను ఆదుకుంటోంది. ప్రభుత్వంతో పాటు దేశంలోని ప్రజలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఎవరైనా తమకు తోచినంత విరాళంగా ఇవ్వొచ్చు. అనాథలుగా మారిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవచ్చు. జవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల వరకు విరాళంగా ఇవ్వొచ్చు. మీరు విరాళంగా ఇచ్చిన సొమ్ము మొత్తం నేరుగా జవాన్ల కుటంబాల బ్యాంకు అకౌంట్లలోకి వెళ్తుంది. లేదా.. ప్రభుత్వ కర్పస్ ఫండ్ కింద జమ అవుతుంది.

ముఖ్య గమనిక.. మీరు ఒరిజినల్ వెబ్ సైట్, మొబైల్ యాప్స్ ను మాత్రమే వినియోగించండి. ఎందుకుంటే.. ఆన్ లైన్ లో ఫేక్ పోర్టల్స్, ఫేక్ యాప్స్ ఎన్నో ఉన్నాయి. వీటి పట్ల జాగ్రత్త వ్యవహరించి మీ విలువైన విరాళాన్ని జవాన్ల కుటుంబాలకు చేరేలా చూడండి. www.bharatkeveer.gov.in అనే వెబ్ సైట్ లింక్.. లేదా.. Bharat Ke Veer App డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది దేశ పౌరులు తమ విరాళాలను భారతీయ ఆర్మీ కోసం కేంద్ర నిధికి అందజేశారు. 

Also Read : పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

Also Read : చైనా వ‌క్ర‌బుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మ‌హ‌మ‌ద్ పై ప్రేమ‌

Also Read : ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం