Wife And Husband: విషాదం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిరణ్ (30), పూజా (22) లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. వారు మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో కాపురం పెట్టాడు.

Wife And Husband: విషాదం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య

Wife And Husband

Updated On : May 23, 2021 / 6:08 PM IST

Wife And Husband: భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిరణ్ (30), పూజా (22) లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. వారు మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో కాపురం పెట్టాడు. కొద్దీ రోజుల క్రితం కిషోర్ కి గుండెజబ్బు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.

బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కిషోర్ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం అందరు ఇంటికి చేరుకున్నారు. భర్త మరణం తట్టుకోలేని భార్య పూజా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒకే సారి ఇద్దరు మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతసేపటికి ఆమె మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిపించారు.