Wife And Husband: పెళ్లైన మొదటి రాత్రే భార్యకు షాకిచ్చిన భర్త

ఎన్నో ఆశలతో మెట్టింట్లో అడుగుపెట్టిన యువతికి తొలిరాత్రే చేదు అనుభవం ఎదురైంది. మొదటి రాత్రే తాను సంసారానికి పనికిరానని భర్త చెప్పడంతో షాక్కు గురైంది.

Wife And Husband: పెళ్లైన మొదటి రాత్రే భార్యకు షాకిచ్చిన భర్త

Wife And Husband

Updated On : June 11, 2021 / 3:11 PM IST

Wife And Husband: ఎన్నో ఆశలతో మెట్టింట్లో అడుగుపెట్టిన యువతికి తొలిరాత్రే చేదు అనుభవం ఎదురైంది. మొదటి రాత్రే తాను సంసారానికి పనికిరానని భర్త చెప్పడంతో షాక్కు గురైంది. అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న తర్వాత ఇలా చెప్పాడు ఏంటని మదనపడింది. చేసేది ఏమిలేక పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. కొద్దీ రోజులు పుట్టినట్లేనే ఉంది. అయితే యువకుడి విషయం తెలిసికూడా అత్తింటివారు వేధిస్తుండటంతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీసులకు పిర్యాదు చేసింది.

ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తెనాలి పాండురంగ పేటకు చెందిన ఎండీ జలాలుద్దీన్, కౌసర్ జాన్ దంపతుల మూడో కుమార్తెను విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఖాజాఖాన్‌ కు ఇచ్చి ఏప్రిల్ 4 న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉద్యోగ నిమిత్తం కెనడా వెళ్తానని చెప్పడంతో ఎన్ఆర్ఐ సంబంధం దొరికిందని కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. తీరా తొలిరాత్రి తనలోని లోపం యువతికి చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.