Madhya Pradesh: వీడి ఐడియా తగలయ్య..! పాము కాటుతో భార్యను హతమార్చాలని చూసిన భర్త.. చివరికి అతని మెడకే చెట్టుకుంది..

మొదటి భార్యను హతమార్చాలని భర్త ప్లాన్ వేశాడు. తన స్నేహితుడితో కలిసి పాము కాటు ద్వారా ఆ పనిచేయాలని, ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి భార్యను విషపూరిత పాముతో కాటువేయించారు. కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇలా రెండు దఫాలుగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోవటంతో విషపూరిత ఇంజక్షన్ ఇచ్చాడు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నఆమె.. పోలీసులను ఆశ్రయించి భర్త, అతని కుటుంబ సభ్యులను కటకటాలపాలు చేసింది.

Madhya Pradesh: వీడి ఐడియా తగలయ్య..! పాము కాటుతో భార్యను హతమార్చాలని చూసిన భర్త.. చివరికి అతని మెడకే చెట్టుకుంది..

snake bite

Updated On : December 15, 2022 / 8:49 AM IST

Madhya Pradesh: మొదటి భార్యను హతమార్చాలని భర్త ప్లాన్ వేశాడు. తన స్నేహితుడితో కలిసి పాము కాటు ద్వారా ఆ పనిచేయాలని, ఎవరికీ అనుమానం రాదని అనుకున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి భార్యను విషపూరిత పాముతో కాటువేయించారు. ఆమె స్పృహతప్పి పడిపోయింది. కానీ, కొద్దిసేపటికే లేచింది. లాభంలేదనుకొని మరోసారి విషపూరిత పామును తెచ్చి ఆమెపై వేశారు. పాముకాటుతో స్పృహకోల్పోయిన ఆమెను తండ్రి గమనించి ఆస్పత్రికి తరలించాడు. ఆ తరువాత పోలీసుల సాయంతో భర్త, ఆయన కుటుంబ సభ్యులు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మాల్యా ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే..

Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు

మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మేరీ స్మగ్లింగ్ కేసులో జైలు పాలయ్యాడు. అతని భార్య షాను బీ మోజిమ్ జైలుకెళ్లాక ప్రియుడితో వెళ్లిపోయింది. రెండేళ్ల తరువాత జైలు నుంచి మోజిమ్ బయటకొచ్చాడు. భార్య ప్రియుడితో పోయిందని తెలిసి.. 2015లో హలీమా బీ అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఇది తెలిసిన మొదటి భార్య నేనుండగా వేరే పెళ్లి ఎలా చేసుకుంటావ్, నేనూ నీతోనే ఉంటానని పట్టుబట్టింది. పలు దఫాలుగా పెద్దల సమక్షంలో పంచాయితీకూడా జరిగింది. చివరికి మోజిమ్ తలొగ్గి మొదటి భార్యను కూడా తనతో ఉండేందుకు అంగీకరించాడు.

Snake Bite Treatment in India : పాముకాటుకు భారత్ లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది..?

మోజిమ్ నిర్ణయం రెండో భార్య హలీమా బీ కి నచ్చలేదు. దీంతో ప్రతీరోజూ వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇక లాభంలేదనుకొని మొదటి భార్యను వదిలించుకోవాలని మోజిమ్ ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ఈ నెల 8న తన స్నేహితుడు స్నేక్ క్యాచర్ అయిన రమేష్ మీనాతో కలిసి విషపూరిత పాముతో కలిసి కాటు వేయించి హతమార్చాలని అనుకున్నారు. మొదటి భార్య ఇంట్లో ఉండగా పామును వదిలాడు. పాము కాటువేసినప్పటికీ ఆమె స్పృహతప్పి పడిపోయింది. కానీ ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది.

Crime News: యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేసిన కార్మికులు

మరో స్నేహితుడితో కలిసి మరోసారి పామును తీసుకెళ్లి ఆమెపైకి వదిలాడు. అయినా ఫలితం లేకపోవటంతో విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఇది గమనించిన షాను బీ తండ్రి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోజీమ్ అజ్మేరీ తో పాటు అతని సోదరుడు, తల్లి, స్నేహితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు.