Minister Nitin Gadkari: ఇలాంటి రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అధికారమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని, ఒక్కోసారి రాజకీయాలనుంచి తప్పుకోవాలని తరచూ అనిపిస్తోందని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Minister Nitin Gadkari: ఇలాంటి రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Minister Nitin Gadkari

Updated On : July 25, 2022 / 5:06 PM IST

Minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నందున రాజకీయాలను విడిచిపెట్టాలని తరచుగా అనిపిస్తోందని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం తన స్వస్థలంలో సామాజిక కార్యకర్త గిరీష్ గాంధీని సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nitin Gadkari : బరువు తగ్గితే…కిలోకి వెయ్యికోట్లు ఇస్తా…గడ్కరీ బంపర్ ఆఫర్ ?

నేను రాజకీయాలను వదులుకోవాలా వద్దా అని అనేక సార్లు ఆలోచిస్తుంటానని, రాజకీయాల కంటే జీవితంలో చేయాల్సింది చాలా ఎక్కువ ఉందని గడ్కరీ వ్యాఖ్యానించారు. రాజకీయాలు సామాజిక మార్పుకు సంబంధించినవని నేను నమ్ముతున్నానని, అయితే ప్రస్తుత రాజకీయాలు అధికారాన్ని కోరుకునేలా మారాయన్నారు. అధికారంలో ఉండటానికి, అధికారంలోకి రావటానికే రాజకీయాలు చేయాల్సి వస్తుందంటూ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సామాజిక ఉద్యమంలో భాగంగా రాజకీయాలు ఉండేవి. సమాజంలో మార్పుకోసం ఆ తర్వాత దేశం, అభివృద్ధిపై దృష్టిపెడుతూ రాజకీయాలు సాగాయి.. కానీ ఇప్పుడు రాజకీయాలు అధికారమే లక్ష్యం అన్నట్లుగా సాగుతున్నాయని అన్నారు.

Director TJ Gnanavel: ‘జై భీమ్’ దర్శకుడి కొత్త చిత్రం ‘దోశ కింగ్’ ..! ఓ మహిళ 18ఏళ్ల సుధీర్ఘ పోరాటం ..

గిరీశ్ గాంధీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వెళ్లిపోవాలని నేను పదేపదే చెప్పేవాడ్ని. నాకు కూడా చాలాసార్లు రాజకీయాలను వదిలివెళ్లిపోవాలని అనిపిస్తోంది. ఎందుకంటే జీవితంలో రాజకీయాల కంటే కూడా సమాజం కోసం చేయాల్సిన పనులు చాలా ఉంటాయని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.