Jairam Ramesh on RahulGandhi T-shirt: టీ-షర్టు, అండర్‌వేర్‌ల గురించి నేను మాట్లాడను: జైరాం రమేశ్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖరీదైన టీ-షర్టు ధరిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ పార్టీ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను టీ-షర్టులు, అండర్‌వేర్‌ల గురించి మాట్లాడను. బీజేపీ కంటైనర్లు, బూట్ుల, టీ-షర్టులు గురించి మాట్లాడుతుందంటే, ఇతర అంశాలపై మాట్లాడడానికి ఆ పార్టీ నేతలు భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

Jairam Ramesh on RahulGandhi T-shirt: టీ-షర్టు, అండర్‌వేర్‌ల గురించి నేను మాట్లాడను: జైరాం రమేశ్

AICC President election

Updated On : September 12, 2022 / 12:58 PM IST

Jairam Ramesh on RahulGandhi T-shirt: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖరీదైన టీ-షర్టు ధరిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ పార్టీ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను టీ-షర్టులు, అండర్‌వేర్‌ల గురించి మాట్లాడను. బీజేపీ కంటైనర్లు, బూట్లు, టీ-షర్టులు గురించి మాట్లాడుతుందంటే, ఇతర అంశాలపై మాట్లాడడానికి ఆ పార్టీ నేతలు భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

కాగా, ‘‘రాహుల్ బాబా విదేశీ టీ-షర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు’’ అంటూ కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన టీ షర్ట్ ను రాహుల్ ధరిస్తున్నారని, దాని ధర రూ.41,000 అని బీజేపీ సోషల్ మీడియాలో పేర్కొంటోంది.

మరోవైపు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇవాళ బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘అది భారత్ జోడో యాత్ర కాదు. అది భారత్ తోడో, ఆగ్ లబావో యాత్ర. ఇటువంటి యాత్రలు చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. దేశంలో హింస చెలరేగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు