మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 08:34 AM IST
మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

Updated On : January 25, 2019 / 8:34 AM IST

ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో  “ది ఒడిషా డైలాగ్” ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ తనకే అన్నీ తెలుసునన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కి, బీజేపీకి మధ్య తేడా ఇదేనన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల వాయిస్ వింటుందని రాహుల్ అన్నారు. ఒడిశా అధికార పార్టీ బీజేడీపై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.

ఒకే బ్రష్ తో బీజేపీ, బీజేడీలు పెయింట్ వేస్తున్నాయని అన్నారు. నవీన్ పట్నాయక్, మోడీ ఇద్దరూ గుజరాత్ మోడల్ ఫాలో అవుతున్నారని, సీఎం మార్కెటింగ్ కోసం వ్యాపారవేత్తలు డబ్బులు చెల్లించే విధానమైన గుజరాత్ మోడల్ నే ఇద్దరు నేతలు ఫాలో అవుతున్నారని తెలిపారు.  మోడీ, పట్నాయక్ ల మధ్య అప్రకటిత సయోధ్య ఉందని తెలిపారు. పట్నాయక్ కూడా నిరకుశంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో  ఫర్ఫెక్ట్ సిస్టమ్ లేదన్న విషయాన్ని రాహుల్ అంగీకరించాడు. కాంగ్రెస్ అస్తవ్యస్తమైపోయింది, అస్తవ్యస్తమైపోయినట్లు కన్పిస్తుంది అంటూ ఓ డైలాగ్ తరచూ వినిపిస్తుండటంపై స్పందించిన రాహుల్ ప్రతి ఒక్క పౌరుడితో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారవేత్తలు ఇలా అందరితో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు.

ఓ రాజకీయ నాయకుడిగా, ఓ మనిషిగా తనకు జరిగిన మంచి పరిణామం బీజేపీ, ఆరెస్సెస్ లు తనను తిట్టడమేనని రాహుల్ అన్నారు. ఇదే తనకు వాళ్లు ఇవ్వగలిగిన పెద్ద గిఫ్ట్ అని రాహుల్ గాంధీ అన్నారు. తనను తిట్టే సమయంలో మోడీ వైపు చూశానని, ఆ సమయంలో ఆయనకు హగ్ ఇవ్వాలని తాను పీల్ అయ్యానని రాహుల్ తెలిపారు.