సూసైడ్ చేసుకోవాలనుకున్నా : జయప్రద షాకింగ్ కామెంట్స్
ముంబై: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. 2009 నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని

ముంబై: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. 2009 నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని
ముంబై: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. 2009 నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని జయప్రద చెప్పారు. దీనికి కారణం తన మార్ఫ్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ కావడమే అని వివరించారు.
“ఆ రోజు నేను బాగా ఏడ్చేశాను. ఇక బతక్కూడదని అనుకున్నా. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. తీవ్రమైన నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు ఎవరూ అండగా నిలవలేదు” అని జయప్రద గతాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. అయితే అమర్ సింగ్ మద్దతుగా నిలవడంతో బతకుపై మళ్లీ ఆశ కలిగిందని జయప్రద చెప్పారు.
క్వీన్స్ లైన్ లిటరేచర్ ఉత్సవంలో రచయిత రామ్ కమల్‌తో జరిగిన సంభాషణలో జయప్రద ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మార్ప్డ్ ఫొటోలు సర్కులేట్ చేసింది సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ అని జయప్రద ఆరోపించారు. అంతేకాదు తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారని ఆమె అన్నారు. దీనికి కారణం ఆజంఖాన్‌పై తాను ఎన్నికల్లో పోటీ చేయడమే అని తెలిపారు.
అమర్‌సింగ్ తనకు గాడ్ ఫాదర్‌తో సమానం అని జయప్రద అన్నారు. అయితే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారని, కానీ తాను అవేమీ పట్టించుకోను అని జయప్రద స్పష్టం చేశారు. ఈ పురుషాధ్యిక ప్రపంచంలో రాజకీయాల్లో ఒక మహిళ రాణించడం చాలా కష్టమైన పని జయప్రద అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆజం ఖాన్‌కు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా చెప్పలేకపోయానని జయప్రద వాపోయారు. నేను నోరు విప్పి ఉంటే ఆ మరుక్షణమే తనను చంపేసి ఉండేవారని అన్నారు.