చైనా సైనికులు భారత్‌లోకి రాకపోతే ఇండియా సైనికులు ఎందుకు చనిపోయినట్లు: చిదంబరం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై పలు అనుమానాలు లేవనెత్తారు. ఇతరులెవ్వరూ లడఖ్ లోని ఇండియా భూభాగంలో అడుగుపెట్టలేదని గల్వాన్ లోయ ఘర్షణ ప్రస్తావన సందర్భంగా అన్నారు. దానిపై శనివారం చిదంబరం స్పందించారు.
‘ప్రధాని స్టేట్‌మెంట్ అంతకంటే ముందు ఆర్మీ చీఫ్, డిఫెన్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి చెప్పిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది. పీఎం మోడీ అందరినీ గందరగోళంలో పడేశారు. చైనా బలగాలు మన భూభాగంలోకి రాకపోతే.. మే 5, మే 6న జరిగిందేంటి. మన సైనికులు అమరులు అవడానికి, గాయాలకు గురి కావడానికి కారణమేంటి’ అని ప్రశ్నించారు.
అంతకంటే ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం పీఎం మోడీ కామెంట్లపై ఇటువంటి ప్రశ్నలే వేశారు. ‘పీఎం మోడీ చైనాకు భారత భూభాగాన్ని అప్పజెప్పేశారు. అది చైనా వాళ్ల స్థలం అయితే మన సైనికులపై దాడి ఎందుకు జరిగింది. ఎలా చనిపోయారని ఆల్ పార్టీ మీటింగ్ తర్వాతి రోజైన శనివారం ప్రశ్నించారు.
మీటింగ్ చివర్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఒక్కరు కూడా మన భూభాగంలోకి అడుగుపెట్టలేదు. అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని కామెంట్ చేశారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనీస్ మిలటరీ చొరబడటమే కాకుండా లడఖ్, పాంగాంగ్ త్సూ, గాల్వాన్ లోయల్లోకి వచ్చేయడంతో దాడులకు దిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
Read: ఒక్క క్లిక్..Amazonలో లిక్కర్ సేల్స్