టెర్రరిజంపై రాహుల్ కామెంట్.. సుష్మా కౌంటర్

దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.

  • Published By: sreehari ,Published On : April 6, 2019 / 07:57 AM IST
టెర్రరిజంపై రాహుల్ కామెంట్.. సుష్మా కౌంటర్

Updated On : April 6, 2019 / 7:57 AM IST

దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.

దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు. రాహుల్ కు ఉగ్రవాదం చిన్న సమస్య అయితే.. ఆయనకు SPG సెక్యూరిటీ కూడా అవసరం లేదన్నారు.

హైదరాబాద్ లో జరిగిన ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగమే పెద్ద సమస్య.. ఉగ్రవాదం కాదన్న రాహుల్ కు నేను చెప్పేది ఒకటే. దేశంలో ఉగ్రవాదం లేనప్పుడు.. ఉగ్రవాదం సమస్యే కాదు. అయితే మీకు SPG సెక్యూరిటీ అవసరం ఎందుకు? (అప్పట్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం గాంధీ కుటుంబంలో రాహుల్ సహా అందరికి spg సెక్యూరిటీ అందిస్తున్నారు). 

మీకు ఉగ్రవాదం పెద్ద సమస్య కాదని అనిపిస్తే.. మాత్రం వెంటనే ఎస్ పీజీ సెక్యూరిటీ అవసరం లేదని రాసి ఇవ్వండి. ఎందుకంటే.. దేశంలో ఉగ్రవాదం లేనప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు కదా?’అని సుష్మా అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ విమర్శల దాడి చేసిన మరుసటి రోజు సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. మోడీ, అద్వానీ పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు తనను చాలా బాధించినట్టు తెలిపారు. రాహుల్ మాట్లాడేటప్పుడు కొంచెం వ్యక్తుల పట్ల మర్యాదతో మాట్లాడటం మంచిదన్న సుష్మా.. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ట్వీట్లు చేశారు.