SCs and STs: ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల.. వెల్లడించిన కేంద్రం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను ఊటంకిస్తూ శిశు మరణాల రేటు, పిల్లల మరణాల రేటు వంటి కీలక ఆరోగ్య సూచికల్లో కూడా గత కొన్ని దశాబ్దాలుగా పురోగతిని సాధించాయని కేంద్ర మంత్రి ఇందర్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో శిశుమరణాల రేటు 2016లో భారీగా తగ్గాయని తెలిపారు. 1992లో 86 శాతంతో పోలిస్తే 2016లో 35 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు

parliament
SCs and STs: షెడ్యూల్డు కులాలు (SC), షెడ్యూల్డు తెగలు (ST)లకు చెందిన ప్రజల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల కనిపించిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ‘ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీ దేశ మానవాభివృద్ధి సూచీ కన్నా తక్కువగా ఉందా? ఎస్సీ, ఎస్టీలు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారో? అందుకు కారణాలేమిటో? తెలియజేయాలి’ కోరుతూ అని పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ ఫులో దేవి నేటమ్ అడిగిన ప్రశ్నకు ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ సోమవారం రాజ్యసభ వేదికగా సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
Bangladesh: బంగ్లా బట్టల బజార్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను ఊటంకిస్తూ శిశు మరణాల రేటు, పిల్లల మరణాల రేటు వంటి కీలక ఆరోగ్య సూచికల్లో కూడా గత కొన్ని దశాబ్దాలుగా పురోగతిని సాధించాయని కేంద్ర మంత్రి ఇందర్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో శిశుమరణాల రేటు 2016లో భారీగా తగ్గాయని తెలిపారు. 1992లో 86 శాతంతో పోలిస్తే 2016లో 35 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కాగా, 2011లో 74 శాతం అని వెల్లడైందని తెలిపారు. ఇతర ఆరోగ్య విషయాల్లో కూడా ఇదే పెరుగుదలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు సమాజిక వర్గాల్లో బాలల మరణాల రేటు 1992లో 39.5 కాగా, 2016లో 6.9 మేరకు తగ్గిందని తెలిపారు.
Mamata Banerjee: బెంగాల్లో అల్లర్లకు బిహార్ గూండాల్ని తెచ్చిన బీజేపీ.. మమత సంచలన ఆరోపణలు
“ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సామాజిక సమూహాల మధ్య హెచ్‌డీఐలలో అంతరాన్ని తగ్గించడం ఎల్లప్పుడూ సామాజిక-ఆర్థిక అభివృద్ధి విధానానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది” అని ప్రణాళికా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, వీరి మధ్య అంతరాలకు కారణం.. పేదరికం, నిరక్షరాస్యత, వేతన కార్మికులుగా ఉండడం వంటివి ప్రధాన కారణాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక డ్రాపవుట్‌ల విషయంలో కూడా ఘననీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. 2015-2016లో 5.12%గా ఉన్న ఎస్సీ/ఎస్టీల డ్రాపవుట్‌ల శాతం గత సంవత్సరంలో 2.54%కి తగ్గిందని అన్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యత మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా ప్రకారం 2020-2021లో అసలు డ్రాపవుట్‌లే నమోదు కాలేదని మంత్రి తెలిపారు.