గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

గ్లోబల్ ట్రెండ్ :  పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Updated On : February 18, 2019 / 11:14 AM IST

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మనోళ్లు మామూలుగా ఆడుకోవట్లేదు. 40మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ఫలితంగా ఇమ్రాన్‌ఖాన్‌పై విరుచుకుపడుతున్నారు. వరదలా వచ్చిపడుతున్న తిట్లతో ఇమ్రాన్‌ఖాన్ ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ నిండిపోతోంది. రీసెంట్‌గా ఏ పోస్టు వచ్చినా రెచ్చిపోతున్న భారత నెటిజన్లు ఇమ్రాన్‌తో ఆటాడుకుంటున్నారు. ఇటీవల ఇమ్రాన్ చేసిన ఇన్‌స్టాగ్రమ్ పోస్టుకు మనోళ్లు రాసిన కామెంట్లు ఇలా ఉన్నాయి.

‘ఏంటి మన వాళ్లు ఇంకా రాలేదు. ఇంక స్టార్ట్ చేయండి’ అంటూ అప్పుడే పెట్టిన పోస్టుపై సుధారెడ్డి అనే నెటిజన్ కామెంట్ రాశాడు. దానికి అమీర్‌పేట్ నుంచి మరో వ్యక్తి,.. తెలుగు సినీ హీరో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలో డైలాగ్‌తో సపోర్ట్ ఇచ్చాడు. ‘మా బాలయ్య బాబు చాలు మీ దేశం అంతుచూడటానికి. బాంబులతో కాదు కంటి చూపుతో చంపేస్తాడు’  

వీటితో పాటుగా వంశీ పసుపుల అనే వ్యక్తి.. ‘ఇంగ్లీషులో కామెంట్ చేయకండి.. వాళ్లకు ఒక్కటే తెలుసు.. మనోళ్లు బాగా చేశారు అనడమే.. పాక్ ప్రధానిని వ్యంగ్యంగా ఉదహరిస్తూ.. ‘ఏంట్రా ఇమ్రాన్ ఏంటి విశేషాలు’ , ‘టెర్రరిజం గురించి ఏమనుకుంటున్నావ్. ఈ ద్వేషాలు పెరగడం మాకిష్టం లేదు’ అని ఒకరు సమాధానం చెప్పమంటూ కామెంట్ రాశారు. 

 

పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉందని.. ఆర్టీస్ క్రాస్ రోడ్‌లో ఉన్న  మూవీ థియేటర్ పార్కింగ్ కలెక్షన్స్ అంతలేదు.. మీ పాక్ డిఫెన్స్ బడ్జెట్’ అని పేర్కొన్నాడు. ఒక్కసారి నేరుగా భారత సైనికులు మీ దేశంలోకి వస్తే ఆ శబ్దానికే గుండె ఆగి చస్తావంటూ ఓ నెటిజన్ రాస్తూ.. ‘ఫేస్ టు ఫేస్ రా.. మా సైనికుల మార్చింగ్ చూసే నీకు హార్ట్ ఎటాక్ వస్తది’ అని కామెంట్ చేశాడు. ఇలా ఇమ్రాన్ సోషల్ మీడియా విమర్శల వరదలో మునిగిపోతుంది. 

ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే ఘటనపై తోసి పుచ్చే వైఖరి చూపిస్తున్న పాకిస్థాన్‌పై అన్ని రకాలుగా విరుద్ధత చూపిస్తోంది భారత్. 

Read Also : ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు

Read Also : పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

 

 

View this post on Instagram

???? #PMIK

A post shared by Imran Khan (@imrankhan.pti) on