పాకిస్తాన్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలి

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 04:07 PM IST
పాకిస్తాన్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలి

జస్టిస్ మార్కండేయ కట్జూ.. వివాదాస్పద అంశాలను సునాయాశంగా మాట్లాడే భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఇటీవలికాలంలో వార్తలకు దూరంగా ఉంటున్న మార్కండేయ కట్జూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇమ్రాన్ ఖాన్ నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని, భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని చిన్న ప్రసంగంతో పరిష్కరించారంటూ కొనియాడారు. అందుకుగాను ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన అన్నారు.

నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ ఖాన్ నిజమైన అర్హుడని, పాకిస్తాన్‌కు చెందిన ఓ వార్తా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఫోన్ ద్వారా కట్జూ మాట్లాడారు. మార్కండేయ కట్జూ మాట్లాడిన వీడియోను సదరు న్యూస్ ఛానెల్ యాంకర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘భారత్-పాక్ వివాదం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక క్రికెటర్‌గా, ఒక రాజకీయ వేత్తగా ఎంతో పరిణతి కనబరిచారు. ప్రసంగంలో సమతుల్యం, వివేకం ప్రదర్శించారు. హ్యాట్సాఫ్ ఇమ్రాన్ ఖాన్’’ అంటూ కట్జూ వ్యాఖ్యానించారు. కాగా, పాక్ ప్రధానిని కట్జూ పొగడటంపై భారత నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.