Rice : బియ్యం ధరలకు రెక్కలు…సతమతమవుతున్న ప్రజలు

బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనలేక సతమతమవుతున్నారు....

Rice :  బియ్యం ధరలకు రెక్కలు…సతమతమవుతున్న ప్రజలు

Rice

Updated On : December 29, 2023 / 11:44 AM IST

Rice : బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనలేక సతమతమవుతున్నారు. ప్రస్థుతం మార్కెట్ లో కిలో బియ్యం ధర రకాన్ని బట్టి 45 రూపాయల నుంచి 70రూపాయల దాకా పలుకుతోంది. గత ఏడాది ఉన్న బియ్యం ధర కంటే అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది.

ALSO READ : Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై మైనే రాష్ట్ర ఎన్నికల అధికారి అనర్హత వేటు

పెరిగిన బియ్యం ధరలను తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బహిరంగ మార్కెట్ లో బియ్యాన్ని విక్రయించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. ఎఫ్‌సీఐ బియ్యం కిలో ధర 29రూపాయలుగా నిర్ణయించింది. అయినా ఎఫ్‌సీఐ బియ్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.

ALSO READ : Petrol-Diesel Prices : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల తగ్గింపు? మోదీ సర్కారు యోచన

ప్రపంచంలోనే బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశంలో వాతావరణ పరిస్థితులు, పంట లభ్యత తగ్గడంతో బియ్యం దిగుబడులు కూడా పడిపోయాయి. దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఖరీఫ్ సీజనులో కొత్త బియ్యం చేతికి వచ్చినా వీటి ధరలు మాత్రం తగ్గటం లేదు. ఈ ఏఢాది వరి విస్తీర్ణం పెరిగినప్పటికి వర్షపాతం తగ్గడంతో పంట దిగుబడులు తగ్గాయి.

ALSO READ : Ayodhyas new airport : అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు

పెరిగిన ఉష్ణోగ్రత, అత్యల్ప వర్షపాతం, నేల కోత వల్ల వరి దిగుబడి తగ్గింది. గత ఏడాది కంటే ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కరవు పరిస్థితులు, వరదల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటకు వివిధ తెగుళ్ల బెడద వల్ల కూడా ధాన్యం దిగుబడి తగ్గింది.

కిలో రూ.25కే భారత్ రైస్…కేంద్రం చర్యలు

నానాటికి పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట విక్రయించాలని నిర్ణయించింది. కిలో 25రూపాయలకే బియ్యాన్ని సామాన్యులకు విక్రయించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది.