ఉగ్రదాడులకు చాన్స్.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, పంజాబ్‌లో హైఅలర్ట్

ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో ..

ఉగ్రదాడులకు చాన్స్.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, పంజాబ్‌లో హైఅలర్ట్

High Alert In Delhi

Independence Day 2024 : సాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చర్యల కారణంగా ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ ఉగ్రవాద నిర్ములనకు కేంద్రం సర్ప వినాష్ ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Also Read : 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

ప్రస్తుతం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూలో పనిచేస్తున్న లష్కరే తోయిబా, జై షే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలను భారీగా మోహరించడం వల్ల దాడిని ఆగస్టు 15న తప్పనిసరిగా ప్లాన్ చేసి ఉండకపోవచ్చని, అయితే ఒకటి లేదా రెండు రోజుల తర్వాత ఉగ్రదాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వేడుకలు, సమూహాలు, భద్రతా సంస్థలు, సైనిక శిబిరాలు, సైనిక వాహనాలు, కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాలపడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐఎస్ఐ ప్రాయోజిత గ్యాంగ్‌స్టర్‌లు, టెర్రరిస్టులు, పంజాబ్, జమ్మూకాశ్మీర్ పరిసర ప్రాంతాలలో చురుకుగా ఉన్నారని, స్వాతంత్ర్య దినోత్సవం, ప్రస్తుతం కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 15న పెద్ద సమ్మేళనాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఈడీ బ్లాస్ట్ చేయొచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Also Read : చంద్రబాబుకు కేఏ పాల్ సూటిప్రశ్న..! రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కీలక వ్యాఖ్యలు

జమ్మూ, కతువా, దోడా, ఉధంపూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగాయి. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు, గ్లోబల్ జిహాదీ గ్రూపులు, స్వదేశీ ఉగ్రవాద సంస్థలు, రాడికల్ సంస్థలు, సిక్కు మిలిటెంట్లు, వామపక్ష తీవ్రవాదులు, ఈశాన్య తిరుగుబాటు గ్రూపుల నుండి కూడా ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్, ఐజిఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు.

ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 15 వేడుకలకు ఎర్రకోటలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమం ముగిసే వరకు ఎర్రకోట, దారి పరిసర ప్రాంతాలు “నో కైట్ ఫ్లయింగ్ జోన్” గా ఉండనున్నాయి. ఆగస్టు 15 వేడుకల భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా పర్యవేక్షిస్తున్నారు. ఎర్ర కోటలో వేడుకలకు 10 వేల మంది పోలీసులతో భద్రత.. 700 AI కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.