INDIA Alliance : పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన ఇండియా కూటమి.. ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ నిర్ణయం
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.

INDIA Alliance
INDIA Alliance Boycotted Parliament Sessions : ఇండియా కూటమి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించింది. పార్లమెంట్ నుంచి 92 మంది ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది.
తాజాగా లోక్ సభ నుంచి మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ లో 95 మంది లోక్ సభ సభ్యులు, 46 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 24 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశానికి 3 రాష్ట్రాల సీఎంలు హాజరవ్వనున్నారు.
మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశానికి రానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సీట్ల సర్దుబాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. బీజేపీని ఎదుర్కోవడం ఎలా అనేదానిపై చర్చిస్తారు. అలాగే 92 మంది ఎంపీల సస్పెన్షన్ అంశంపై కూడా నేతలు చర్చించనున్నారు.