India Beats China: చైనాను దాటేసిన ఇండియా.. అమెరికా తర్వాత మనమే
భారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇక జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా పెద్ద మార్పే వచ్చింది. 2013-14లో 91,287 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.. ప్రస్తుతం అవి 1,45,240 కిలోమీటర్లకు పెరింది

Road Network: మొన్ననే జనాభా విషయంలో చైనాను దాటేసిన ఇండియా.. తాజాగా మరో ఫీట్ సాధించింది. రోడ్ నెట్‌వర్క్‌లో డ్రాగన్ దేశాన్ని భారత్ అధిగమించింది. దీంతో ప్రపంచంలో ఎక్కువ రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత రెండవ దేశంగా భారత్ నిలిచింది. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భారతదేశ రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా అవతరించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళశారం తెలిపారు.
‘‘భారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇక జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా పెద్ద మార్పే వచ్చింది. 2013-14లో 91,287 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.. ప్రస్తుతం అవి 1,45,240 కిలోమీటర్లకు పెరింది’’ అని గడ్కరి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘మోదీ ప్రభుత్వానికి 9 ఏళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
Forest: ఒక నిమిషానికి ఎంత అడవిని కోల్పోతున్నామో తెలిస్తే షాకవుతారు
గత తొమ్మిదేళ్లలో ఈ రంగంలో భారత్ ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించిందని, అమెరికా తర్వాత భారత్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని గడ్కరి అన్నారు. టోల్ ఆదాయం 2013-14లో 4,770 కోట్ల రూపాయల నుంచి 41,342 కోట్ల రూపాయలకు పెరిగిందని అన్నారు. 2030 నాటికి టోల్ ఆదాయాన్ని 1,30,000 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
Pragati Maidan Tunnel: ఢిల్లీలో హైటెక్ చోరీలు.. కార్లు ఆపని టన్నెల్ కేంద్రంగా నేరాలు
ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించడానికి సహాయపడిందని ఆయన అన్నారు. ఇంతటితో ఆగకుండా.. దీన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి గడ్కరి పేర్కొన్నారు.