Ladakh: లద్దాఖ్‌లో భారత్‌, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి

పెట్రోలింగ్ విధివిధానాలను రూపొందించేందుకు క్షేత్ర స్థాయి కమాండర్లు సమావేశం అవుతున్నారు.

Ladakh: లద్దాఖ్‌లో భారత్‌, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి

Updated On : October 30, 2024 / 6:36 PM IST

భారత్, చైనా మధ్య తూర్పు లద్దాఖ్ పరిస్థితుల విషయంలో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అక్కడి వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి భారత్, చైనాలు నిర్ణయించడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు శాంతియుతంగా మారాయి.

ఉద్రిక్త పరిస్థితుల నుంచి ఆ ప్రాంతం బయటపడింది. తూర్పు లద్దాఖ్‌ డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో సైనిక ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు.

సాధారణ పెట్రోలింగ్‌ను త్వరలో పునఃప్రారంభిస్తామని చెప్పారు. పెట్రోలింగ్ విధివిధానాలను రూపొందించేందుకు క్షేత్ర స్థాయి కమాండర్లు సమావేశం అవుతున్నాని అన్నారు. పెట్రోలింగ్ విధివిధానాలను అన్ని గ్రౌండ్ కమాండర్ల మధ్య జరిగే చర్చల్లో నిర్ణయిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.

బ్రిగేడియర్, అంతకంటే తక్కువ స్థాయి ఇరు దేశాల సైనికాధికారులు నిర్ణయిస్తారని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు తమ భూభాగంలో నిర్వహించే పెట్రోలింగ్ ఇరువైపులా సమన్వయంతో ఉంటుందని సైనిక వర్గాలు చెప్పాయి. 20 మంది సైనికులతో బృందాలుగా సాధారణ పెట్రోలింగ్ ఉండేలా చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది.

ముఖాముఖి, ఘర్షణలు ఎల్‌ఏసీ స్టాండ్‌ఆఫ్‌లను నివారించడానికి ఉభయ దేశాలు అంగీకరించిన విధానాల ప్రకారం పెట్రోలింగ్ ఉటుందని అధికారులు అంటున్నారు. ఇరు దేశాల బలగాలు ఉపసంహరణ పూర్తి అయిన నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఇరు దేశాల సరిహద్దు సమావేశాల ప్రదేశాల్లో మిఠాయిలు పంచుకోవాలని నిర్ణయించారు సైనికాధికారులు.

Viral Video: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. నడిరోడ్డుపై కనపడ్డ బ్యాలెట్‌ బాక్స్‌