Viral Video: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. నడిరోడ్డుపై కనపడ్డ బ్యాలెట్ బాక్స్
కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై ఆ బ్యాలెట్‌ను గుర్తించి దాన్ని తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగాల్సి ఉన్న వేళ ఓ బ్యాలెట్ బాక్స్ నడిరోడ్డుపై కనపడడం ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. నడిరోడ్డుపై బ్యాలెట్ బాక్స్ పడి ఉన్న దృశ్యాలు ఓ కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.
ఫ్లోరిడాలోని కట్లర్ బేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎన్నికల వర్కర్ వెళ్తున్న ట్రక్కు వెనుక నుంచి ఆ బ్యాలెట్ బాక్స్ రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై ఆ బ్యాలెట్‌ను గుర్తించి దాన్ని తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ బ్యాలెట్ బాక్స్‌పై సీల్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
బ్యాలెట్ రోడ్డుపై పడిపోయినప్పటికీ వచ్చే నష్టం ఏమీ లేదని తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ డేడ్ రీజినల్ లైబ్రరీ ముందస్తు ఓటింగ్ సైట్లో బ్యాలెట్లను ఇప్పటికే స్కాన్ చేశామని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగాల్సి ఉంది. అమెరికాలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా ఎన్నికలు జరుపుతారు.
Box of ballots and other election materials found on a road in Miami 🤯
A man driving found the items last night and immediately took them to police.
Given this is such an important election, every news outlet should be reporting this right?
— FloridaMan.eth 🍊 (@votefloridaman) October 29, 2024