ఫామ్‌హౌస్ కేసు.. కీలకంగా మారిన రాజ్ పాకాల విచారణ..

ఈ కేసులో రాజ్ పాకాల ఎలాంటి విషయాలు వెల్లడించారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఫామ్‌హౌస్ కేసు.. కీలకంగా మారిన రాజ్ పాకాల విచారణ..

Updated On : October 30, 2024 / 4:48 PM IST

Raj Pakala : మోకిల పోలీస్ స్టేషన్ లో రాజ్ పాకాలను విచారించారు పోలీసులు. సుమారు 2 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించిన అంశాలపై రాజ్ పాకాల నుంచి వివరాలు రాబడుతున్నారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. వారి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. వారి స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు మరిన్ని వివరాలు ఆరా తీయనున్నారు. దీంతో మోకిల పోలీసుల విచారణ కీలకంగా మారింది. నార్సింగ్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ సాగింది.

మోకిల ఫామ్ హౌస్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. రాజకీయాలను వేడెక్కించింది. రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు న్యాయవాది కూడా వచ్చారు. ఈ కేసులో రాజ్ పాకాల ఎలాంటి విషయాలు వెల్లడించారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజ్ పాకాల అత్యంత సన్నిహితుడు విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఈ కేసులో ఏ-1గా రాజ్ పాకాల ఉన్నారు. దాంతో కొన్ని రోజులుగా పోలీసులు రాత్రి సమయంలో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు.

అప్పటి నుంచి రాజ్ పాకాల అజ్ఞాతంలో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మోకిల పోలీసుల విచారణకు సంబంధించి తనకు రెండు రోజుల సమయం కావాలని ఆయన పిటిషన్ లో కోరారు. కోర్టు కూడా ఆయనకు రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల అనుమతి నిన్నటితో ముగియడంతో ఇవాళ న్యాయవాది సమక్షంలో మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చారు రాజ్ పాకాల.

కేసుకు సంబంధించి అనేక చిక్కుముళ్లు ఉన్న పరిస్థితి ఉంది. రాజ్ పాకాల పిలిస్తేనే తాను దీపావళి పార్టీకి వెళ్లానని, అతడు ఇస్తేనే కొకైన్ తీసుకున్నట్లుగా విజయ్ మద్దూరి చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అతడు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు రాజ్ పాకాలను విచారిస్తున్నారు.

 

Also Read : ఫాంహౌస్‌ కేసులో పైచేయి సాధించిందెవరు.?