Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

ఈ ఏడాది ప్రారంభంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వేలకు చేరాయి. ప్రస్తుతం 10వేల దిగువన కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.

Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

Corona Cases (2)

Updated On : November 24, 2021 / 10:29 AM IST

Corona Cases :  దేశంలో కరోనా (Corona Cases) కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది ప్రారంభంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వేలకు చేరాయి. ప్రస్తుతం 10వేల దిగువన కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,283 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,11,481 (Corona Active Cases) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763 (Total Corona Cases)కి చేరగా.. మరణాల సంఖ్య 4,66,584 (Corona Deaths In India) కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,949 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,57,698 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

చదవండి : Corona Cases : దేశంలో ఏడాదిన్నర కనిష్టానికి కరోనా కేసులు

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 118.44 (Corona Vaccination) కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24గంటల్లో 76.58 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరోవైపు కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో కరోనా భయం పోయినట్లు కనిపిస్తుంది. మాస్కులు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు.