INDIA: 2 రోజుల పాటు విపక్ష పార్టీల సమావేశాలు
ముంబైలోని ఓ హోటల్ లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని విపక్ష నేతలు యోచిస్తున్నారు.

Opposition meet
INDIA – Mumbai: దేశంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి(Opposition bloc) ఇండియా తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబరు 1న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాలు నిర్వహించిన రెండో సమావేశం (Opposition meeting) మాదిరిగానే తదుపరి భేటీ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏను ఎదుర్కోవడానికి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా రెండు రోజుల పాటు చర్చలు జరిపి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముంబైలోని ఓ హోటల్ లో ఈ సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నారు. సెప్టెంబరు 1న సాయంత్రం ప్రతిపక్ష పార్టీల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెబుతారు. విపక్షాల సమావేశంపై పలు తేదీలు అనుకున్నప్పటికీ వాటిపై తుది నిర్ణయానికి రాలేదు.
ఇప్పుడు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం శివసేన (యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్డీఏ మొదటి సమావేశం పట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.
Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి