Blockchain Wedding: భారత్ లో తొలి.. బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్..
పూణెకు చెందిన అనిల్ నరసిపురం, శృతి నాయర్ బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్‌తో వార్తల్లోకి ఎక్కారు.భారత్ లో తొలి.. బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్ చేసుకున్న జంట వీరే కావటం విశేషం.

Blockchain Wedding In India Fist Time (1)
Blockchain Wedding In India Fist time : పెళ్లి చేసుకునే విషయంలో పద్ధతులు మారిపోతున్నాయి. వధూవరులు ఒకరిముందు మరొకరు కూర్చుని ఒకరి తలపై మరొకరు జీలకర్రా బెల్లం పెట్టుకుని చేసుకునే రోజులు ఈ డిజిల్ కాలంలో కొన్ని పెళ్లిళ్లు డిజిటల్ గానే జరుగుతున్నాయి. దానికి ఇదిగో వీరి వివాహమే ఉదాహరణ. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి రోజుల్లో వివాహాలు వింత వింతగా విచిత్రంగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ పెళ్లిళ్లు, వర్చువల్ పద్ధతిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
అంతేకాదు ఇప్పుడు కొత్తగా మరో కొత్తగా వచ్చిన ‘బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్’ (Blockchain Wedding) హాట్ టాపిక్‌గా మారింది. పూణెకు చెందిన అనిల్ నరసిపురం, శృతి నాయర్ బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్‌తో వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరు బ్లాక్‌చెయిన్‌లో పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలో ఇలాంటి పెళ్లి ఇదే మొదటిది కావడం విశేషం. 2021 నవంబర్‌లో అనిల్ నరసిపురం, శృతి నాయర్ ఆన్‌లైన్‌లో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘డిజిటల్ పంతులు’తో ఈ పెళ్లి చేయటం విశేషం.
Also read : Space Wedding : అంతరిక్షంలో వరుడు.. అమెరికాలో వధువు.. 18 ఏళ్లక్రితం అరుదైన పెళ్లి
ఏంటీ బ్లాక్‌చెయిన్‌లో పెళ్లి అంటే..పెళ్లికూతురు ఉంగరంతో ఎన్ఎఫ్‌టీని క్రియేట్ చేశారు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు చేసుకున్న ప్రమాణాలు కూడా ఇందులో ఎంబెడ్ చేశారు. “మేము పెద్దలు చెప్పిన వాగ్దాలు చేయకపోయినా..మా వివాహ బంధాన్ని చక్కగా నిలుపుకుంటాం.దాన్ని బలంగా ఉంచుకోవటానికి చేయాల్సినదంతా చేస్తాం” అని రశారు. ఈ పెళ్లి కోసం వధూవరులు ఇద్దరూ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లను ఉపయోగించారు. డిజిటల్ పంతులుగా వ్యవహరించిన అనూప్ పక్కీ NFT(Non-Fungible Token)ని ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌లో రూపొందించి తనకు ట్రాన్స్‌ఫర్ చేశారని అనిల్ నరసిపురం తెలిపారు.
ఈ పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు ఇద్దరూ పక్కపక్కనే ల్యాప్‌టాప్స్‌పట్టుకుని కూర్చున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గూగుల్ మీట్‌లో ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. డిజిటల్ పంతులు అనూప్ పక్కీ ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక కేవలం 15 నిమిషాల సమయంలో జరిగింది.
దీని గురించి వరుడు అనిల్ మాట్లాడుతూ..”నేను, శృతి ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌తో బ్లాక్‌చెయిన్ అఫీషియల్ వెడ్డింగ్ చేసుకున్నామని తెలిపారు. పవిత్రమైన తమ వివాహబంధం, ఒకరిపట్ల మరొకరికి నిబద్ధతకు గుర్తుగా NFT ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌లో ముద్రించామని అనిల్ నరసిపురం లింక్డ్‌ఇన్ పోస్టులో వివరించారు.
పంతులు ఆశీర్వాదాలు అందుకున్న తర్వాత నేను ఎన్‌ఎఫ్‌టీని నా భార్య డిజిటల్ వ్యాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశానని అనిల్ నరసిపురం తెలిపారు. ఈ ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత వీరిద్దరినీ భార్యాభర్తలుగా ప్రకటించారు. ఇలా బ్లాక్‌చెయిన్‌లో పెళ్లి చేసుకున్న తొలి జంట తామేనని మురిసిపోతు తెలిపారు ఈ కొత్తజంట.
కాగా..డిజిటల్ లెడ్జర్‌లో స్టోర్ చేసిన డేటాను NFTఅంటారు. దీన్నే బ్లాక్‌చెయిన్ అని కూడా పిలుస్తారు. ఈ డిజిటల్ అసెట్ విభిన్నమైనది. పరస్పరం మార్చుకోవడానికి వీలు ఉండదు. ఫోటోలు, వీడియోలు, ఆడియో, ఇతర డిజిటల్ ఫైల్స్‌తో ఎన్ఎఫ్‌టీలు రూపొందించవచ్చు. ఇది యాజమాన్య హక్కుకు సంబంధించిన రుజువు లేదా ప్రామాణికతకు సంబంధించిన పబ్లిక్ సర్టిఫికెట్‌ను డిజిటల్ లెడ్జర్ అందిస్తుంది.