Power Shortage: జులై – ఆగష్టు మధ్య విద్యుత్ సంక్షోభం?: పవర్ ప్లాంట్లలో అడుగంటిన బొగ్గు నిల్వలు
రుతుపవనాలకు ముందే భారత్ లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం జూలై-ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తుందని స్వతంత్ర పరిశోధనా సంస్థ CREA తెలిపింది

Coal
Power Shortage: మరోమారు దేశంలో విద్యుత్ సంక్షోభం రానుందా? రానున్న వర్షాకాలంలో దేశంలో విద్యుత్ అంతరాయాలు అధికంగా ఉండనున్నాయా? ప్రైవేట్ పరిశోధన సంస్థ జరిపిన విశ్లేషణ ద్వారా అవుననే..సమాధానం వినిపిస్తుంది. రుతుపవనాలకు ముందే భారత్ లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం జూలై-ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తుందని స్వతంత్ర పరిశోధనా సంస్థ CREA తెలిపింది. ప్రస్తుత బొగ్గు నిల్వ పిట్‌హెడ్ పవర్ స్టేషన్‌లలో 13.5 మిలియన్ టన్నులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పవర్ ప్లాంట్ల వద్ద 20.7 మెట్రిక్ టన్నులు ఉంది. విద్యుత్ సంస్థలు రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్‌లో స్వల్ప పెరుగుదలను కూడా పరిష్కరించే స్థితిలో లేవని మరియు బొగ్గు రవాణా కోసం ముందుగానే ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉందని గ్రహించాలని ” సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్స్ (CREA) తాజా నివేదికలో వెల్లడించింది.
other stories: PM Relief fund: కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం సహాయ ‘నిధి’ విడుదల
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (CEA) ఆగస్టులో గరిష్టంగా 214 GW విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది. అదనంగా, సగటు ఇంధన డిమాండ్ కూడా మే నెలలో ఉన్నదానికంటే 1,33,426 మిలియన్ యూనిట్లకు (MUs) పెరగాల్సి ఉంది. నైరుతి రుతుపవనాల ఆగమనం కారణంగా మైనింగ్ మరియు గనుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాకు మరింత ఆటంకం కలిగిస్తుంది. రుతుపవనాలకు ముందు బొగ్గు నిల్వలను తగిన స్థాయిలో నిల్వఉంచని పక్షంలో జూలై-ఆగస్టు 2022లో దేశం మరో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోక తప్పదని క్రయ వెల్లడించింది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 777.26 మిలియన్ టన్నుల (MT) బొగ్గు ఉత్పత్తి జరిగింది. అందుకు విరుద్ధంగా FY21లో 716.08 MTలతో 8.54 శాతానికి తగ్గింది.
other stories: Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం
FY 21-22లో దేశంలో 1,500 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు సేకరణకు ఆస్కారం ఉంది, అయితే మొత్తం ఉత్పత్తి 777.26 మెట్రిక్ తన్నులుగానే ఉంది. ఇది దాని ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు సగం మాత్రమే. అందువల్ల బొగ్గు కొరత నిజమేనని గ్రహించి థర్మల్ విద్యుత్ సంస్థలు ముందు జాగ్రత్త వహించాలని క్రయ తెలిపింది. ‘‘ప్రస్తుత పరిస్థితి ఈ మధ్య కాలంలో మొదలైంది కాదు… మే 2020 నుంచి పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి” CREA విశ్లేషకుడు సునీల్ దహియా చెప్పారు. మరోవైపు బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఎంత బొగ్గు అవసరం ఉంటుందో అంచనా వేయాలంటూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(CEA)ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశించింది.