అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ 

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 09:59 AM IST
అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ 

Updated On : December 7, 2019 / 9:59 AM IST

భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత..వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ప్రపంచ దేశాల ముందు భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటోందనీ..అత్యాచారాలకు రాజధానిగా మారిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ కుమార్తెలు, చెల్లెళ్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశీలు ప్రశ్నిస్తున్నారనీ..దానికి ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. 

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నారనీ..ప్రధాని మాత్రం నోరు విప్పి ఒక్క మాటా మాట్లాడటంలేదనీ అన్నారు. ఆరోపణలు ఎదుర్కొనేవారిపై కనీసం చర్యలు కూడా తీసుకోవటంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ లో జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుసుకుని ప్రపంచ దేశాల్నీ భాతర్ వైపు చూస్తున్నాయన్నారు.  

దేశ వ్యాప్తంగా మహిళలపై ప్రతీరోజు హింసలు..దారుణాలు జరగుతున్నాయనీ..ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించటంపై విఫలమైందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యూపీలో ఉన్నావ్ ఘటనలో బాధితురాలని పెట్రోల్ పోసి హత్యకు యత్నించిన ఘటనలో చికిత్స పొందుతు బాధితురాలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ఇటువంటి దేశంలో మన అక్కలు చెల్లెళ్లు జీవించటానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.  అలాగే దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరిగిన దిశ ఘటన సంచలనం కలిగించింది. ఇలా ఒకటీ రెండూ కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై జరగుతున్న త్యాచారాలు..హత్యలు..అఘాయిత్యాలు..హింసలు ఇలా లెక్కలేనన్ని కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో రాహల్ గాంధీ భారత దేశం అత్యాచారాలకు రాజధానిగా మారిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.